మంత్రుల కార్లు ఓవర్ స్పీడ్ .. భారీగా ట్రాఫిక్ చలాన్లు

Update: 2020-02-21 13:30 GMT
గత కొని రోజుల క్రితం కేంద్రం ట్రాఫిక్ రూల్స్ లో భారీగా మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ రూల్స్ తో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కాగా, రోడ్ల పై కాస్త స్పీడ్ దాటితేనే, ఇలా క్లిక్ మనిపించి.. వేలకు వేల ఫైన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 10 ట్రాఫిక్ చలాన్లు మించితే ఛార్జిషీట్ దాఖలు చేసి, కోర్టులో ప్రవేశపెడతామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించిన సంగతి కూడా తెలిసిందే. అయితే చట్టాలు రూపకల్పన చేసే తమకు చట్టం వర్తించదని అంటున్నారు తెలంగాణలోని ప్రజాప్రతినిధులు. ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, రోడ్లపై క్రమశిక్షణగా ఉండాలి అని సందేశాలు ఇచ్చే నేతలు వారు మాత్రం నిబంధనలు పాటించకుండా దర్జాగా ఏళ్ల రోడ్లపై తిరుగుతున్నారు. తెలంగాణ మంత్రుల వాహనాలు రహదారులపై దూసుకుపోతున్నాయి.

తాజాగా మంత్రుల వాహనాలపై ఉన్న జరిమానాలను పరిశీలిస్తే అధిక భాగం ఓవర్ స్పీడ్‌కు సంబంధించినవే కావడం విశేషం. మంత్రులు తరుచూ వివిధ జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనలకు హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఔటర్ రింగ్‌రోడ్, రాష్ట్ర రహదారుల మీదుగా ప్రయాణిస్తుంటారు. ఈ సమయంలో వారి వాహనాల స్పీడ్ 100కి.మీ దాటుతున్నట్లు స్పీడ్ లేజర్ గన్‌లు పసిగడుతున్నాయి. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు సైతం పరిమితికి మించిన వేగంతో దూసుకుపోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ లిస్ట్ మంత్రి జగదీష్ రెడ్డి కార్‌ పై 9 అత్యధికంగా ట్రాఫిక్ చలానాలతో రూ.9,315 జరిమాన నమోదవ్వగా, ఈటల రాజెందర్ 6 చలాన్లకు గానూ 6,210ల ఫైన్ ఉంది, కొప్పుల ఈశ్వర్ 5 చలాన్లకు రూ.5,175లు ఉంది. సబితా ఇంద్రా రెడ్డి సొంత వాహనంపై 5లకు రూ.2,775 జరిమానా ఉంది. ఇక గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్ వాహనాలపై 3 చలాన్లు ఉండగా, శ్రీనివాస్ గౌడ్ వాహనంపై రెండు చలాన్లు నమోదయ్యాయి. మరి వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చూడాలి. అయితే , వీరిలో చాలామంది మంత్రులు కావడంతో చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


Tags:    

Similar News