లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలివీ.. వీటికి మినహాయింపు

Update: 2020-04-15 05:50 GMT
దేశంలో మే 3 వరకు లాక్ డౌన్ ను ప్రధాని నరేంద్రమోడీ నిన్న పొడిగించారు. ఈ మేరకు జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన బుధవారం లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేస్తామని తెలిపారు. అన్నట్టుగానే ఈరోజు మార్గ దర్శకాలను విడుదల చేశారు. ఏప్రిల్ 20 తర్వాత మాత్రం కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయం, కొన్ని పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులను ప్రకటించింది.

ఇందులో భాగంగా మే 3వరకు అన్ని విమాన సర్వీసులు, రైళ్లు,బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేశారు.  ఈనెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్టు ప్రకటించారు.

*కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలు ఇవీ..
-గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్లు పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు.

-గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో కార్మికులు, నిర్మాణ భవనం దగ్గర ఉంటే నిర్మాణాలు జరుపుకోవచ్చు

-నిత్యావసరాలు అంటే మందులు, ఫార్మ ఉత్పత్తులు, గ్రామాల్లోని అన్ని పరిశ్రమలను తెరుచుకోవచ్చు.

-పాల వ్యాపారం, ఉత్పత్తులు, పౌల్టీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగు చేయవచ్చు..

--ఉపాధి పనులకు అనుమతి..

-అక్వా ఉత్పత్తుల విక్రయాలకు అనుమతి.

- వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు అనుమతి. వ్యవసాయ యంత్ర పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు అనుమతి

-విత్తనోత్పత్తి, ఎరువులు, పురుగుల మందుల దుకాణాలకు అనుమతి

- రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుఖాణాలకు అనుమతి.

-సినిమా హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, మాత్రం... మే 3 వరకూ తెరవకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

- రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై కేంద్రం మే 3 వరకూ నిషేధం విధించింది. అలాగే... మెట్రో రైళ్లు, బస్సు సర్వీసులు కూడా మే 3 వరకూ లాక్‌డౌన్‌లోనే ఉంటాయి.

- సామాజిక, రాజకీయ క్రీడా, మత పరమైన కార్యక్రమాలు,వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించకూడదు. అన్ని ప్రార్థనా స్థలాలు మే 3వరకు క్లోజ్ చేసి ఉంటాయి.

-విద్యా సంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు మే 3వరకు తెరవకూడదు.

--అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మంది మించి పాల్గొనకూడదు.

-లాక్ డౌన్ అమల్లో దేశ ప్రజలంతా ముఖానికి మాస్కులు ధరించాలి. ఆరు బయట ఉమ్మి వేయడం చట్టప్రకారం నేరం.. జరిమానా.. జైలు శిక్ష విధిస్తారు.

-ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలిమెడిసన్ సర్వీసులు రోజూ నడుస్తాయి. మందుల షాపుల, మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కేంద్రాలు తెరిచే ఉంటాయి.

ఈ మినహాయింపులు ఇచ్చిన వాటిని ఏప్రిల్ 20 నుంచి కొనసాగించవచ్చు.మిగతావన్నీ మే 3వరకు బంద్ చేయాలి. మే 3 తర్వాత ప్రధాని మోడీ మరోసారి లాక్ డౌన్, మార్గదర్శకాలపై స్పందిస్తారు.
Tags:    

Similar News