జపాన్ లోని టోక్యో లో విశ్వ క్రీడలు ఒలంపిక్స్ అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. పథకాల కోసం ఇండియా కి చెందిన అథ్లెట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను 49 కేజీలా విభాగంలో రజత పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ కి తోలి రోజే రజతం దక్కిందని ఆనందపడినా.. స్వర్ణ పథకం మిస్ అయ్యిందే అని చాలామంది నిరుత్సాహపడ్డారు. ఈ పోటీలో చైనాకు చెందిన జీహో జీజీ స్వర్ణ పతకం గెలుచుకున్నది. అయితే ఆమెను డోప్ టెస్టు చేయించుకోవాలని టోక్యో నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు.
ఒక వేళ చైనా వెయిట్ లిఫ్టర్ కనుక డోప్ టెస్టులో విఫలం అయితే మీరాబాయ్ చాను స్వర్ణ పతకం గెలిచే అవకాశం ఉంటుంది. టోక్యోలో స్వర్ణం గెలిచిన జీహో జీజీని డోప్ టెస్టు చేయించు కోవాలని నిర్వాహక కమిటీ చెప్పింది. ఈ టెస్టు తప్పని సరిగా జరపాల్సిందే అని ఏఎన్ ఐ వార్తా సంస్థ తెలిపింది. జీహో జీజీ టోక్యో ఒలింపిక్స్ లో 210 కేజీల బరువు ఎత్తింది. అదే సమయంలో మీరాబాయ్ చాను స్నాచ్ లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జర్క్ లో 115 కేజీలు మొత్తం 202 కేజీలు ఎత్తింది. ఇక ఇండోనేషియాకు చెందిన విండీ కాంటిక 194 కేజీల బరువు ఎత్తి కాంస్ పతకం దక్కించుకున్నది. మరోవైపు, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 69 కిలోల విభాగంలో కరణం మల్లీశ్వరీ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె తరువాత మీరాబాయి చాను ఒలింపిక్ పతకం సాధించి రికార్డ్ నెలకొల్పింది.
కాగా, చాను టోక్యో నుంచి బయలుదేరి ఇండియాకు వచ్చింది. తాను ఈ పతకం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నదని.. కుటుంబాన్ని కలసి తన సంతోషాన్ని పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు జీహో జీజీని డోప్ టెస్టు పూర్తయ్యే వరకు టోక్యో వదలి వెళ్లవద్దని నిర్వాహకులు ఆదేశించారు.