మరో తెరాస ఎమ్మెల్యేకు పాజిటివ్.. ప్రభుత్వ వర్గాల్లో హైటెన్షన్

Update: 2020-07-16 09:45 GMT
తెలంగాణలో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తుంది. లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  కరోనా భారిన పడేవారిలో సామాన్య ప్రజలు, ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం  ఉన్నారు. ముఖ్యంగా టీఆర్  ఎస్ పార్టీలో కరోనా అలజడి సృష్టిస్తుంది. ఇప్పటికే పలువురి ఎమ్మెల్యేలకి , మంత్రులకి కరోనా పాజిటివ్ సోకగా...తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు సైతం కరోనా బారినపడ్డారు అని ప్రసారమాద్యమాల్లో ఓ వార్త ప్రచారం అవుతుంది.

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావుకి  కరోనా లక్షణాలు కనిపించడంతో రెండు రోజుల కింద ఆయన పరీక్షలు చేయించుకున్నారని ,  బుధవారం ఆ టెస్టుల రిపోర్టులు వచ్చాయని ,ఆ రిపోర్ట్ లో ఎమ్మెల్యే కి  కరోనా పాజిటివ్ గా వచ్చిందని , దీనితో  మిర్యాలగూడ లోని తమ ఇంట్లోనే ఐసోలేషన్‌ లో ఉన్నారని ప్రసారమాద్యమాల్లో ప్రచారం అవుతుంది.

ఇకపోతే , తెలంగాణలో  అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా కరోనా బారినపడ్డారు. ఇక కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే.  వీరిలో చాలా మంది ఇప్పటికే కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా , రాష్ట్రంలో ఇప్పటివరకు  39,342 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 12,958 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 25,999 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 386 మంది చనిపోయారు
Tags:    

Similar News