మిగిలిన విషయాలన్ని వదిలేద్దాం. కళ్లకు కట్టినట్లుగా అంతలా కనిపించిన వైనాన్ని ఏపీ ప్రభుత్వానికి చెందిన వారు వెల్లడించిన వివరాల్ని చూస్తే అవాక్కు కావటమే కాదు.. ఇలాంటివే చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పక్కదారి పట్టిస్తున్నారా? అన్న విస్మయం కలుగక మానదు. అంచనాలకు భిన్నంగా.. ఊహకు ఏ మాత్రం చిక్కని రీతిలో సాగిన ఏపీ ఉద్యోగుల పీఆర్సీ నిరసన ర్యాలీకి సంబంధించి ఏపీ సర్కారు తరఫున ప్రస్తావించిన అధికారిక వివరాలు అవాక్కు అయ్యేలా చేస్తాయి. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఏపీ ఉద్యోగులు నిరసన ర్యాలీని నిర్వహించటం తెలిసిందే.
పోలీసుల ఆంక్షలు.. ఎక్కువ మంది హాజరు కాకుండా చేపట్టిన చర్యలన్ని ఒక ఎత్తు అయితే.. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికి పుట్ట పగిలినట్లుగా వెల్లువలా వచ్చి పడిన ఉద్యోగులతో బెజవాడ వీధులన్ని ఎంతలా కిక్కిరిపోయాయన్నది తెలిసిందే. టీవీచానళ్లలో కనిపించిన జన సందోహం.. ర్యాలీకి సంబంధించిన ఫోటోలు వాట్సాప్.. సోషల్ మీడియాలలో విపరీతమైన వైరల్ కావటం తెలిసిందే. ఏపీ హైకోర్టులో శుక్రవారం జరిగిన ఒక కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించిన వివరాలు నోట మాట రాని రీతిలో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ.. ఏపీ ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. దాన్ని సవాలు చేస్తూ విశాఖపట్నానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
దీనికి సంబంధించిన విచారణ శుక్రవారం జరిగింది. కోర్టు విచారణలో పిల్ దాఖలు చేసిన సాంబశివరావు తరఫున న్యాయవాది శరత్ కుమార్ వాదనలు వినిపిస్తే.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా గురువారం బెజవాడలో జరిగిన నిరసన ర్యాలీ గురించిన ప్రస్తావన వచ్చింది. ఉద్యోగులు ఇచ్చిన సమ్మె విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని చెప్పటం సరికాదని ఏజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. కొవిడ్ వేళ.. చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిచంారు.
దీనికి సమాధానం చెప్పిన ఏపీ శ్రీరామ్.. చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని.. 5 వేల మంది రావాల్సిన చోట 35 వేల నుంచి 40 వేల వరకు వచ్చారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఏజీ ప్రస్తావించిన 35 వేల నుంచి 40 వేల వరకు ఉద్యోగులు నిరసన ర్యాలీలో పాల్గొన్నట్లుగా చెప్పిన వివరాలు ఆశ్చర్యపోయేలా చేశాయి.
ఒక అంచనా ప్రకారం బెజవాడ నిరసన ర్యాలీకి 4 లక్షల మందికి తగ్గలేదని చెబుతారు.కొందరైతే అంతకంటే ఎక్కువే హాజరైనట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి వచ్చిన వీడియోలు అదే విషయాన్ని చెబుతున్నాయి. అలాంటిది హాజరైన వారికి సంబంధించి పదో శాతాన్ని మాత్రమే అధికారికంగా వెల్లడించటం చూస్తే.. సీఎం జగన్మోహన్ రెడ్డికి సైతం ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఆయన్ను తప్పుదోవ పట్టిస్తున్నారా? అన్న సందేహం కలుగుక మానదు. పత్రికల్లో ప్రచురితమైన ఫోటోలు.. సోషల్ మీడియా.. వాట్సాప్.. చానళ్లలో టెలికాస్ట్ అయిన వీడియో క్లిప్పింగులు చూస్తేనే విషయం ఇట్టే అర్థమవుతుంది. అందుకు భిన్నంగా అంత తక్కువ మందిని ఏపీ హైకోర్టుకు చెప్పటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. లెక్కలన్ని ఇలానే ఉంటాయా ఏంది?