షేకా లతీఫా.. దుబాయ్ రాజు - ఆ దేశ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్-అల్-మక్తూమ్ కుమార్తె. ఆరుగురు భార్యలున్న దుబాయ్ రాజుకు 30మంది సంతానంలో లతీఫా ఒకరు. పేరుకే రాకుమారి కానీ, ఆంక్షల చట్రంలో ఆమె బందీ. ఆ ఆంక్షలను ఛేదించుకుని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని భావించిన ఆ యువరాణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతున్న వివరాల ప్రకారం.. కన్నతండ్రి నుంచే ఆమె తీవ్ర వేధింపులు ఎదుర్కొంది. తనకున్న అధికార దర్పంతో చీకటి గదిలో ఆమెను మూడేళ్లపాటు బంధించి చిత్రహింసలు పెట్టారు. ఎలాగైనా దేశం విడిచి పారిపోవాలని నిర్ణయించుకున్న లతీఫా.. అమెరికాలో కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. ఫిన్లాండ్ కు చెందిన తన స్నేహితురాలు టీనా జౌహానియస్ - ఫ్రాన్స్ కు చెందిన కెప్టెన్ హెర్వ్ జాబెర్ట్ - మరో ముగ్గురు సిబ్బందితో కలిసి అధికారుల కళ్లుగప్పి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారు ఒక బోటులో దుబాయ్ నుంచి బయటపడ్డారు. అయితే, గత మార్చి 14న వీరి బోటు భారత్ లోని గోవా జలాల్లోకి ప్రవేశించింది. తీరానికి 20కిలోమీటర్ల దూరంలోనే వారిని తీరగస్తీ దళం కమెండోలు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, తాను ఆశ్రయం కోరి వచ్చానని ఆమె ఆరుస్తున్నా వినిపించుకోకుండా వారిని బంధించి - యూఏఈ అధికారులకు సమాచారమందించారు. హెలికాప్టర్ లో వచ్చిన అధికారులకు వారిని అప్పగించి పంపించివేశారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తున్నది. మార్చి 20న హెర్వ్ జౌబెర్ట్ ను - టీనా జౌహానియస్ లను దుబాయి అధికారులు విడిచిపెట్టడంతో వారు తమ స్వదేశానికి వెళ్లిపోయారు. తాము ప్రతిఘటించకపోయినా తమను కొట్టారని - పలుమార్లు అభ్యర్థించినా దయాదాక్షిణ్యాలు చూపలేదని భారత కోస్ట్ గార్డ్స్ పై వారు ఆరోపణలు చేశారు. అప్పటినుంచి యువరాణి లతీఫా ఆచూకీ దొరుకలేదు. గుర్తు తెలియని ప్రాంతంలో ఆమెను దుబాయి ప్రభుత్వం నిర్బంధించి ఉంటుందని భావిస్తున్నారు. తన తండ్రి వేధింపుల వల్లే తాను పారిపోతున్నానని - ఒకవేళ తాను పట్టుబడితే చంపబడటమో - మరింత దుర్భర స్థితిలోకి నెట్టడమో జరుగుతుందంటూ లతీఫా అంతకుముందు విడుదల చేసిన ఓ వీడియో కలకలం సృష్టించింది. అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఆమె ఆచూకీ తెలుపాలని దుబాయ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నా.. ఆ దేశం స్పందించడం లేదు.
అయితే, ఈ ఎపిసోడ్ కు భారత్ కు కలిగిన ప్రయోజనం ఆసక్తికరం. యువరాణిని యూఏఈకి తిరిగి అప్పగించిన భారత్.. క్రమంగా ఆ దేశంతో దౌత్యం నడిపించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన క్రిస్టియన్ మిషెల్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ప్రభుత్వం భారత్ కు అప్పగించడంతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. అయితే 19నెలల క్రితమే ఆయనను అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసినా స్పందించని యూఏఈ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు ఆగమేఘాలపై న్యాయ ప్రక్రియ పూర్తి చేసి ఇండియాకు ఆయనను ఎందుకు అప్పగించింది? అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఏంటంటే....మిషెల్ అప్పగింత నిర్ణయం వెనుక దుబాయ్ యువరాణి షేకా లతీఫా ఉన్నట్లు సమాచారం. దేశం నుంచి పారిపోయేందుకు ఆమె చేసిన విఫలయత్నం వల్లే యూఏఈ భారత్ కు సహాయపడిందని తెలుస్తున్నది.ఇందుకు కారణాలు కూడా కూడా కనిపిస్తున్నాయి.
2015 నవంబర్ లో క్రిస్టియన్ మిషెల్ కోసం ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినా.. స్పందించని దుబాయ్ ప్రభుత్వం క్రమంగా భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. లతీఫాను అప్పగించిన ఉదంతంలో భారత్ మౌనం పాటిస్తూ రావడం కూడా యూఏఈకి ఉపయోగపడింది. ఒకవేళ భారత్ గొంతువిప్పితే.. లతీఫా ఆచూకీ కోసం అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి మరింత తీవ్రమయ్యేది. ఈ నేపథ్యంలో యుఏఈ ఇండియాతో సఖ్యతగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. మిషెల్ బ్రిటిష్ జాతీయుడైనందున తాము ఆయనను అప్పగించేందుకు తమ దేశ చట్టాలు ఒప్పుకోవని ఇంతకాలం చెబుతూ వచ్చిన దుబాయ్.. ఆగమేఘాలపై న్యాయ ప్రక్రియను పూర్తిచేసింది. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశంలో పర్యటిస్తున్న సమయంలోనే మిషెల్ ను బేషరతుగా భారత్ కు అప్పగించింది.