ఆర్జీవీకి త్వరలో చిప్పకూడు?

ఈ సమయంలో... అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ పై కామెంట్ చేశారు!

Update: 2024-12-15 05:15 GMT

సమాజంలో జరిగే రకరాకాల విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. కాకపోతే ఇంతకాలం ఎలా మాట్లాడినా, ఎలా పోస్టు పెట్టినా నడిచిపోయింది.. కానీ, ఒక్కసారి దానికి చర్యలు తీసుకోవడం మొదలుపెడితే ఎలా ఉంటుందనేది ఇటీవల రామ్ గోపాల్ వర్మ స్వయంగా చవిచూశారనే చెప్పాలని అంటున్నారు.

‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై పలు అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అప్పడు మొదలైంది అసలు పెర్ఫార్మెన్స్ అనే చర్చ జరిగింది.

ఉదయం లేస్తే డాన్ లు, డెన్ ల గురించి మాట్లాడే ఆర్జీవీ.. పోలీసులు విచారణకు రమ్మనే సరికి కలుగులో దాక్కున్నారనే కామెంట్లు నెట్టింట దర్శనమిచ్చాయని అంటున్నారు. పోలీసులకు... సినిమా షూటింగ్ లో చాలా బిజీ అని ఎస్సెమ్మెస్ లు పెట్టిన ఆయన... తర్వాత తాను తన ఆఫీసు (ఆర్జీవీ డెన్) లోనే ఉన్నానని, తన వద్దకు ఎవరూ రాలేదని చెప్పుకొచ్చారు!

తర్వాత కోర్టును ఆశ్రయించడం.. ముందస్తు బెయిల్ రావడం తెలిసిందే! దీంతో.. మరోసారి ఆర్జీవీ కాస్త ధైర్యంగా, ఇటీవల కనిపించిన టైపు బెదురు లేకుండా మాట్లాడుతున్నారనే చర్చ మొదలైందని అంటున్నారు. ఈ సమయంలో... అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ పై కామెంట్ చేశారు!

అవును... అల్లు అర్జున్ వ్యవహారంలో తెలంగాణ సర్కార్ పైనా ఆర్జీవీ స్పందించారు. ఇందులో భాగంగా... తెలంగాణకు చెందిన అల్లు అర్జున్ భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీని అందించి.. రాష్ట్రానికి గొప్ప బహుమతిని అందించారు కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అల్లు అర్జున్ ను జైలుకు పంపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అని ట్వీట్ చేశారు.

దీంతో... మరోసారి ఆర్జీవీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. తన అరెస్టుపై స్పందించిన అల్లు అర్జున్ తాను చట్టాన్ని గౌరవించే మనిషినని తెలిపారు. మరోపక్క.. చట్టం అందరికీ సమానమే.. అది సంజయ్ దత్ అయినా, సల్మాన్ అయినా, ప్రధాని అయినా, సామాన్యుడు అయినా అంటూ రేవంత్ క్లారిటీ ఇచ్చారు.

తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందితే, ఆమె కుమారుడు ఆస్పత్రిలో సీరియస్ కండిషన్స్ లో ఉంటే స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. ఇందులో మరో ఉద్దేశ్యం ఏమీ లేదని ప్రభుత్వం తరుపున స్పష్టత వచ్చింది. దీనిపై అటు అల్లు ఫ్యామిలీ కానీ, ఇటు మెగా ఫ్యామిలీ కానీ మరో కామెంట్ చేయలేదు!

కానీ... అల్లు అర్జున్ అరెస్టును తెలంగాణ సర్కార్ ఇచ్చిన రిటన్ గిఫ్ట్ అంటూ ఆర్జీవీ కామెంట్ చేయడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో... ఇప్పటికే ఆర్జీవీపై ఏపీ సర్కార్ లోని పలువురు పెద్దలకు పీకల వరకూ ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటికే దాదాపు అరెస్టు వరకూ వెళ్లి వచ్చిన పరిస్థితి అని గుర్తు చేస్తున్నారని అంటున్నారు.

పరిస్థితి ఇంత క్రిటికల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు తాను నివాసం ఉంటున్న తెలంగాణలో ప్రభుత్వ పెద్దలతో అవసరమా ఆర్జీవీ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. పైగా... ఆర్జీవీపై సమాజంలోని ఓ వర్గంలో ఉన్న అభిప్రాయం అత్యంత దారుణమనే చెప్పాలి.

ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ మధ్యలో మహిళలు మైకుల ముందు స్పందిస్తుంటే.. పోర్న్ చూస్తున్నాను అని చెప్పిన సంస్కారం ఆర్జీవీ సొంతం అని అంటున్నారు. సామాజిక బాధ్యత పూర్తిగా మరిచిన వ్యక్తి అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారని చెబుతున్నారు.

అలాంటి వ్యక్తి అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించడానికి తనకు హక్కు ఉందని చెప్పుకుంటే చెప్పుకొవచ్చు కానీ... తెలంగాణ ప్రభుత్వానికి కూడా హక్కులు, అధికారాలు ఉంటాయని మరిచిపోతే చిప్పకూడ తప్పకపోవచ్చనే చర్చ జరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News