సచివాలయ ఎగ్జామ్ కీలో తప్పులు..

Update: 2019-09-06 16:07 GMT
గ్రామ - వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షకు సంబంధించిన కీ లో తప్పులు దొర్లినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా విడుదల అయిన కీ లో కొన్ని తప్పులున్నాయని అభ్యర్థులు అంటున్నారు. ఈ విషయంలో వారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

సీరిస్ ఏ ప్రశ్నాపత్రంలో 2002 సంవత్సరంలో దేశంలో ఆమోదం పొందిన కీలకమైన పర్యావరణ చట్టం ఏది? అనే ప్రశ్నకు గానూ సమాధానం గా ఛాయిస్ గా ఒకటిని ప్రకటించారు నిర్వాహకులు. ఆ ఛాయిస్ లో నంబర్ ఫోర్ సరైన సమాధానం అని అభ్యర్థులు అంటున్నారు. ఆ సంవత్సరంలో బయోడైవర్సిటీ చట్టం వచ్చిందని.. అదే అసలైన సమాధానం అని - దాని చాయిస్ నాలుగుగా ఇచ్చి - కీ లో మాత్రం ఆన్సర్ వన్ అంటూ పేర్కొనడాన్ని అభ్యర్థులు తప్పు పడుతున్నారు.

ఇక సీరిస్ ఏ ప్రశ్నాపత్రంలో నలభై ఏడో ప్రశ్నను తెలుగులోకి అనువదించడంలో తప్పు దొర్లిందని అభ్యర్థులు అంటున్నారు. చక్రవడ్డీగా పేర్కొనాల్సిన కొశ్చన్ లో బారు వడ్డీగా పేర్కొన్నారని చెబుతున్నారు.

ఇక తొంభై ఎనిమిదో ప్రశ్నలో సరైన సమాధానాన్ని ఛాయిస్ లో ఇవ్వనే లేదని అభ్యర్థులు చెబుతున్నారు. స్వయం సహాయక సంఘాలను నాబార్డుతో అనుసంధానించిన సంవత్సరం పేర్కొనాలంటూ ఇచ్చిన ఆ ప్రశ్నలో దానికి తగిన సమాధానాన్ని ఛాయిస్ లో పేర్కొనలేదని అభ్యర్థులు చెబుతున్నారు. వీటన్నింటి మీదా దాదాపు నలభై వేల అభ్యంతరాలు వ్యక్తం అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో పరీక్ష నిర్వాహకులు ఎలా స్పందిస్తారో!

   

Tags:    

Similar News