చిన్నమ్మపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2017-02-05 08:21 GMT
రాజకీయాల్లో టైమింగ్ చాలా కీలకం. ఏ సమయంలో ఏం చేయాలో అది చేయకపోతే దాని వల్ల జరిగే డ్యామేజ్ అంతాఇంతా కాదు. తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్న చాలామందికి టైమింగ్ విషయంలో తప్పులు చేసిన అధినేతలు ఎన్ని ఇబ్బందులకు గురి అయ్యారో బాగా తెలుసు. రోజుకో పరిణామంతో.. తమిళనాడు రాజకీయాల్లో సందడి సందడిగా మారాయి. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని విధంగా తయారయ్యాయి.

ఎవరికివారు.. తమకు తోచిన రీతిలో వ్యవహరించటం.. పవర్ కోసం చేస్తున్న ప్రయత్నాలు రాజకీయ సంచలనాలకు కారణంగా మారాయి. అమ్మ మరణం తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పన్నీరు సెల్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారన్న వేళలో సీఎం కుర్చీపై చిన్నమ్మ కన్నేసినట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే.. ఈ వార్తల్ని అన్నాడీఎంకే సీనియర్ నేతలు కొట్టివేస్తున్నా.. చిన్నమ్మను సీఎంగా చేసే ప్రక్రియజోరుగా సాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు చిన్నమ్మ కానీ సీఎంగా ఎంపికైన పక్షంలో అన్నాడీఎంకే చీలిక దిశగా పయనించే ప్రమాదం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే విపక్ష నేత స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టైమ్లీగా ఉన్న ఆయన వ్యాఖ్యలు చిన్నమ్మను దెబ్బ తీసేలా ఉండటం గమనార్హం.

తాజాగా మీడియాలో మాట్లాడిన స్టాలిన్.. అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాల్ని తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పిన ఆయన.. శశికళను కానీ.. జయలలిత కటుంబంలోని ఇతర సభ్యులను తమిళ ప్రజలు సీఎంగా అంగీకరించరని వ్యాఖ్యానించారు. ‘‘గడిచిన ఎన్నికల్లో తమిళ ప్రజలు అమ్మను ఎన్నుకున్నారే కానీ.. చిన్నమ్మనో.. మరొకరినో (దీపను పరోక్షంగా ఉద్దేశించి) కాదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా వేరే వారిని తమిళ ప్రజలు ఒప్పుకోరు’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News