ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లిలో ఆత్మహత్య చేసుకున్న జనసేన పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఇటీవల పరామర్శించిన జనసేనాని పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అన్నా రాంబాబును అథ: పాతాళానికి తొక్కేస్తానని సవాల్ చేశారు.
పవన్ కళ్యాణ్ విమర్శలపై వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఖండించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా పవన్ తనను విమర్శించడంలో అర్థం లేదని అన్నారు.
తాను తిట్టడం వల్లే వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకోలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తొత్తుగా పవన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న ఆకృత్యాలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
తాను 2009లో ఇదే గిద్దలూరు నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుఫున గెలిచానని.. జనసేనకు ఒక్క సీటు వస్తేనే ఇంత అరాచకం చేస్తోంటే.. ఇక మెజారిటీ లభిస్తే ఇంకెంత దారుణాలకు పాల్పడతారోనని ఆందోళన వ్యక్తం చేశారు.
వెంగయ్య ఆత్మహత్యకు తాను కానీ.. తన అనుచరులు కానీ.. వైసీపీ కార్యకర్తల ప్రమేయం కానీ ఉన్నట్లు నిరూపించగలిగితే స్వచ్ఛందంగా న్యాయస్థానంలో లొంగిపోతానని అన్నా రాంబాబు సవాల్ చేశారు. ఈ సవాల్ ను పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. వెంగయ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషక్ష్ాన్ని ఆయన కుటుంబ సభ్యులే చెప్పారని.. పవన్ కు నమ్మకం లేకపోతే నార్కోటిక్స్ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.