ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రజలు అడిగేది.. మౌలిక వసతుల గురించే.. ఈ రోడ్డు వేయించండి.. తాగడానికి పంపు వేయించండి.. వీధి లైట్లు సరిచేయించండి.. మురుగునీరు పోయేలా చేయండి.. ఇలా ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అయినా ఆశించిదే ఇలాంటివాటినే. కనీసమైన వసతులను కూడా సమకూర్చని ప్రభుత్వాలు ఉన్నా లేనట్టే.
అయితే ఆ మహిళా ఎమ్మెల్యే ప్రభుత్వ తీరుతో చూస్తూ ఊరుకోలేదు. రోడ్లు మరమ్మతులు చేయించాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో తన నిరసనను ఓ రేంజులో ప్రదర్శించారు. ఏకంగా నడిరోడ్డు మీద పడిన గుంతలో బురద నీటిలో స్నానం చేసి అధికారులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు తీవ్ర వైరల్‌గా మారాయి. 133 వ నంబరు జాతీయ రహదారికి మరమ్మతులు చేపట్టాలని జార్ఖండ్ రాష్ట్రంలోని గొడ్డా మహిళా ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ పలుమార్లు జాతీయ రహదారుల విభాగం అధికారులకు విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి అధ్వానంగా మారింది. దీంతో వర్షం కురిస్తే చాలు బురదనీరు రోడ్డుపైనే నిలుస్తోంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టక పోవడం వల్ల ప్రతీరోజూ ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ రహదారిపైనే బురద నీటిలో దిగి స్నానం చేశారు. తద్వారా తన నిరసనను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆ రహదారికి మరమ్మతులు చేపట్టేవరకూ తాను బురద నీటిలో నుంచి బయటకు రానని ఎమ్మెల్యే దీపికా పాండే భీష్మించారు. బురద నీటిలో మహిళా ఎమ్మెల్యే స్నానం చేస్తూ.. వినూత్న నిరసన తెలపడంతో ప్రజలు, అధికారులు భారీ ఎత్తున అక్కడికి తరలిరావడం విశేషం.
ఇక ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ప్రతిపక్షాలు రోడ్ల దుస్థితిపై ఎన్ని పోరాటాలు చేసినా జగన్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ రోడ్లు తమ హయాంలో పాడవలేదని.. చంద్రబాబు హయాంలోనే పాడయ్యాయని నెపం గత ప్రభుత్వం మీద వేస్తోందని ప్రతిపక్ష పార్టీల నేతలు, నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఏపీ రోడ్ల పైన ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నా ఇప్పటికీ రోడ్లు బాగుపడకపోవడం విచారకరమని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.