నిన్న మొన్నటి వరకూ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ.. పార్టీకి రక్షకుడిగా వ్యవహరించిన నేత పార్టీ మారిపోతే పరిస్థితులు ఎలా మారతాయన్న దానికి విజయవాడలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జలీల్ ఖాన్ కొద్ది రోజుల కిందట పార్టీ మారిన విషయం తెలిసిందే.
జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఆయన సైకిల్ ఎక్కేశారు. తాజాగా ఆయనకు పార్టీ విప్ అందజేసేందుకు పార్టీ విద్యార్థి విభాగం విజయవాడ నగర అధ్యక్షుడు అంజిరెడ్డి మరో నలుగురు నేతలు కలిసి జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న జగన్ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధులు జలీల్ ఖాన్ ఇంటికి వెళ్లారు. ఎప్పటిమాదిరి ఇంట్లోకి వెళ్లబోయిన వారిని జలీల్ ఖాన్ మనుషులు అడ్డుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విప్ ను జారీ చేసే వార్తను కవర్ చేయటానికి తాము వచ్చినట్లుగా.. అందుకు అనుమతించాలని వారు కోరటం.. దానికి జలీల్ ఖాన్ కుదరదనటం జరిగిపోయాయి. ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వాదన పెరిగి.. చివరకు జలీల్ ఖాన్ మనుషులు చేయి చేసుకునే వరకూ వెళ్లిందని జగన్ మీడియా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
జగన్ మీడియా ప్రతినిధుల మీదా.. పార్టీ నేతల మీద ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆగ్రహాన్ని చూసిన ఆయన వర్గం వారు చెలరేగిపోయారు. తమకు అడ్డొచ్చిన వారిని ఇష్టారాజ్యంగా కొట్టేసినట్లుగా వారు వాపోతున్నారు. ఎంత మీడియా అయితే.. ఒక ఎమ్మెల్యేకు ఇష్టం లేకుండా ఆయన ఇంటికి వెళ్లి తమకు అవసరమైన విజువల్స్ తీసుకుంటాననంటే ఒప్పుకుంటారా ఏంటి..?