ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల .. పోలింగ్ ఎప్పుడంటే !

Update: 2021-02-18 09:58 GMT
ఏపీలో గత కొన్ని రోజులుగా వరుసగా ఎన్నికల నోటిఫికెషన్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మున్సిపల్ సంగ్రామానికి తెరలేవనుంది. ఈ మధ్యలోనే తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను  ఎన్నికల సంఘం గురువారం నాడు విడుదల చేసింది. గుమ్మడి సంధ్యారాణి, గుమ్మదుల తిప్పేస్వామి, వట్టికూటి వీరవెంకన్న చౌదరి, షేక్ మహ్మద్ ఇక్బాల్ ల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. అలాగే  పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తంగా ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇకపోతే , ఈ ఎన్నికలకి ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అలాగే మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును ప్రకటించారు.మార్చి 5న నామినేషన్ల పరిశీలన కాగా, మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.  అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. మార్చి 18వ తేదీలోపుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది.
Tags:    

Similar News