టీడీపీ ఎల్ బీ నగర్ ఎమ్మెల్యే - బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. నయీం డైరీలో ఈయన పేరు కూడా ఉండడంతో ఈ కేసును విచారిస్తున్న సిట్ రేపో మాపో కృష్ణయ్యను జైలు లోకి నెట్టనుందనే వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఓన్ పేపర్ నమస్తే తెలంగాణలో అయితే - నయీంతో టీడీపీ - కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధాలపై స్పెషల్ స్టోరీలే వస్తున్నాయి. ఇక, కృష్ణయ్య విషయం నిన్నంతా మీడియాలో హల్ చల్ చేసింది. దీనిపై స్పందించిన కృష్ణయ్య .. తనకు నయీంతో సంబంధం లేదన్నారు. అసలు నయీంను తాను చూడనేలేదని చెప్పారు. అధికార పక్షం కావాలనే తనను ఇరికిస్తోందని అన్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. గతంలో ఆయన నయీం హతమైన తర్వాత మీడియా మాట్లాడిన వ్యాఖ్యల క్లిప్పింగ్ లు చూస్తే.. అప్పట్లో ఆయన చేసిన కామెంట్లు వెరైటీగా ఉన్నాయి. నయీంకు తనకు 1986 నుండే సంబధాలున్నాయని చెప్పి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత ఈ సంబంధాలు కేవలం స్నేహమేనని - ఎలాంటి డబ్బుల లావాదేవీలు జరగలేదని కృష్ణయ్య సెలవిచ్చారు. భువనగిరిలో ఉర్సు - వినాయకచవిత ఉత్సవాలకు హాజరయ్యానని ఒప్పుకున్నారు. కాకపోతే నయీం చెబితే వెళ్లలేదట. ఇక నయీంతో నేనెప్పుడు మాట్లాడలేదన్న ఆయన ఒక సారి మాత్రం కొంత మందిని బెదిరిస్తున్నారని తన దాకా వస్తే తానే ఫోన్ చేసి వద్దని బెదిరించానని చెప్పడం గమనార్హం.
ఇక, ఒకచోట ఒక మీడియాతో మాట్లాడిన మాటను మరో చోట మరో మీడియా గొట్టం ముందు మార్చేయడం కృష్ణయ్యకు అలవాటుగా మారిందనేది ఆయన అనుచరులే చెప్పేమాట. గతంలోనూ నయీం విషయంలో ఇలాగే మాట్లాడారు కృష్ణయ్య. నయీం తన పోరాటాలను చూసి.. సీఎం అయితే - తిరుగులేదని అన్నాడని చెప్పిన కృష్ణయ్య అదే నోటితో ఛీ.. తూ.. అలాంటివేమీ మామధ్య జరగలేదని చెప్పారు. ఒక సారి తనకు కొన్ని సార్లు నయీం ఫోన్ చేసేవాడని చెప్పిన క్రిష్ణయ్య ఎందుకు చేశాడో మాత్రం సరిగ్గా చెప్పలేదు.
ఇక, నయీం ను చంపడాన్ని సమర్ధిస్తున్నాను కానీ ఎన్ కౌంటర్ పై విచారణ చేయాలని చెప్పడం కృష్ణయ్యకే చెల్లింది. రేపో మాపో మీకు కూడా సిట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మీడియా అంటే.. వస్తే రానీ అప్పుడు చూద్దామని కృష్ణయ్య అంటున్నారు. ఏదేమైనా.. సిట్ జాబితాలో కృష్ణయ్య పేరు ఉందనేది ఖాయంగా వినిపిస్తున్న మాట. మరి రాబోయే వారం పది రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.