ఏపీ అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు కాకపుట్టించాయి. ప్రతిపక్ష చంద్రబాబు, టీడీపీ నేతలు టార్గెట్ గా ఆమె మాటల తూటాలు పేల్చారు. ముఖ్యంగా గురువారం స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఆయనను తోడ్కొని వెళ్లని బాబు వైఖరిని రోజా మొదట ఖండించారు. నాడు స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని తోడ్కొని పోకుండా బాబు అవమానించాడని.. ఇప్పుడు తమ్మినేనిని కూడా అవమానించాడని.. బాబు చరిత్రే అది అంటూ మండిపడ్డారు.
ఇక చెవిరెడ్డి భాస్కరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పట్టుకొని ‘బంట్రోతు’ అనడం సభలో దుమారం రేపింది. అయితే ఈ వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై తాను పోరాడితే అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకుండా చాలా కుట్రలు చేశారని.. సుప్రీం కోర్టు తీర్పు తీసుకొచ్చినా అసెంబ్లీలోకి రానీయలేదని రోజా ఫైర్ అయ్యారు. మా వాళ్లు చేసిన తప్పు తో చూస్తే చంద్రబాబు గుంజీలు తీసి లెంపలేసుకున్నా సరిపోదు అంటూ రోజా ఫైర్ అయ్యారు. దీనికి సభ మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లింది.
చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని.. రుణమాఫీ చేస్తానని మరిచిపోయిన చంద్రబాబు తప్పును అంగీకరిస్తే మా సీఎం జగన్ ఈ విషయం పై స్పందిస్తారని రోజా చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించడంపై రాద్ధాంతం చేస్తున్నారని.. బాబు ఇంకా తాను సీఎం అనుకుంటున్నాడని.. ప్రతిపక్ష నేత అన్న విషయం మరిచిపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన సెక్యూరిటీనే ఇప్పుడూ ఇస్తున్నారన్నారు.
జగన్ బీసీ, అణగారిన, మహిళలకు ఇచ్చిన గౌరవంలో చంద్రబాబు ఇసుమంతైనా ఇవ్వలేదని.. అందుకే బీసీలు వైసీపీని గెలిపించాయని జగన్ అన్నారు.