దళితుల విషయంలో చంద్రబాబు తీరును.. ప్రభుత్వ విప్ చింతమేని వ్యాఖ్యలతో తేటతెల్లం చేశాయని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అమానించాడని.. ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దళితుల గురించి దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇక వైసీపీలోకి వలసలపై కూడా చంద్రబాబుకు రోజా కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాబలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని రోజా పేర్కొన్నారు. అలా వచ్చే ప్రతి ఒక్కరూ తమ పదవులకు రాజీనామా చేయడం వైఎస్ జగన్ నైతికతకు నిదర్శనమి పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం వైసీపీ నుంచి కొన్న వారి చేతి కూడా రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.
పుల్వామాలో 43 మంది చనిపోయిన ఘటనలో దేశమంతా ఖండిస్తుంటే చంద్రబాబు మాత్రం ఈ ఘటనను ఎందుకు సమర్థిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే నోరుమెదపని బాబు.. ఇప్పుడు పాక్ ఉగ్రవాదులకు బలైపోయిన సైనికుల విషయంలో మోడీని రాజీనామా చేయమనడం ఎంతవరకు సమంజసమని.. అలా అయితే బాబు కూడా రాజీనామా చేయాలని ధ్వజమెత్తారు. బాబు తనకో నీతి.. మరొకరికి వేరే నీతి అన్నట్టు గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.