ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకి అసలు టైం బాగుండటం లేదు. అసలే పదవుల కోసం ప్రాకులాడటానికే సమయం సరిపోవడం లేదు అని బాధపడుతుంటే ..ఈ మధ్య ఆ ఎంపీ ఆ అమ్మాయి తో ఉన్నారు ..ఈ ఎమ్మెల్యే ఆ అమ్మాయితో ఉన్నాడు అంటూ ఒక్కొక్కరి రతి క్రీడల వీడియోలు బయటకి వస్తుండటంతో .. తప్పు చేసిన అందరిలోనూ వణుకు మొదలైంది. ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో బీజేపీ కి చెందిన నేతల అశ్లీల వీడియోలు వైరల్ అవుతుండటం విశేషం.
ఇకపోతే గత కొన్ని రోజుల ముందు కర్ణాటకలో అసెంబ్లీలోనే పోర్న్ వీడియోలు చూస్తూ ఒక ఎమ్మెల్యే అడ్డంగా బుక్కైయ్యారు. ఇలాంటి ఘటనలు అక్కడ తరచూ జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కర్ణాటక లో మాత్రమే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ లాంటి రాష్ట్రాల్లో సైతం బిజెపి ఎమ్మెల్యేలు ఫోర్న్ వీడియోలు చూస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్ అవుతుండటంతో ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తోంది. తాజాగా కర్ణాటకలో బిజెపికి చెందిన ఓ ఎమ్మెల్యే శృంగార వీడియో బహిర్గతమై, వైరల్ అవుతోంది. గదగ్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఓ యువతితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, రోణ ప్రాంతానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కర్ణాటక అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు ఇలాంటి విషయాలతో వార్తల్లోకి ఎక్కడం ఇప్పుడే కాదు... గత ఆరేళ్ళ క్రితమే ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూస్తూ వార్తల్లోకెక్కిన బిజెపి నాయకుడు లక్ష్మణ్ సవాడీపై అప్పట్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అదే లక్ష్మణ్ సవాడీకి బిజెపి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. దీనిపై మహిళా సంఘాలు పెద్ద రచ్చే చేశాయి. 2012లో రాష్ట్ర అసెంబ్లీలో లక్ష్మణ్ సవాడీతో పాటు సహచర బీజేపీ మంత్రులు సి.సి పాటిల్, కృష్ణ పాలేమర్‌లు పోర్న్ వీడియోలు చూస్తూ మీడియా కంట పడ్డారు. అది కాస్తా వైరల్‌గా మారి అప్పట్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.
తాజాగా బయటకి వచ్చిన ఈ వీడియో పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో అనుమానితుడైన మాజీ ఎమ్మెల్యే శ్రీశైలప్ప బిరదూరుకు అల్లుడైన ఉదయ్ దేశాయ్ ని అరెస్ట్ చేశారు. ఈ వీడియోను ఎప్పుడు తీశారన్న విషయమై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. కర్ణాటకలో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో బయటకి రావడం తో ఈ అశ్లీల వీడియో వ్యవహారం కర్ణాటకలో కాక రేపుతోంది.