తెలివి ఎవరి సొత్తు కాదు. ఆ విషయం అందరికి తెలిసిందే అయినా.. ఎవరికి వారు తమకంటే పోటుగాళ్లు లేమని ఫీలైపోతుంటారు.రాజకీయాల్లో ఇది మరికాస్త ఎక్కువగా ఉంటుంది. తిరుగులేని అధికారంలో ఉన్న వారి గురించి పోల్చుకోరుకానీ.. తమ సమకాలీనుల గురించి మాత్రం నేతలు తరచూ పోల్చుకుంటూ.. తాము దేన్లోనూ తక్కువ కాదన్నట్లుగా చెబుతుంటారు. తాజాగా తెలుగు తమ్ముడి తెలివిని చూసి మిగిలిన తమ్ముళ్లు తెగ ఇదైపోతున్నారు.
వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో మొదలైన అసెంబ్లీ సమావేశాల్ని పురస్కరించుకొని.. ఏపీ అధికారపక్షానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ తన ప్రసంగాన్ని కవితతో షురూ చేశారు. అందులో బాబును పొగిడేసిన తీరు వినూత్నంగా ఉందని చెప్పొచ్చు. మిగిలిన వారి కంటే భిన్నంగా అసెంబ్లీ సాక్షిగా బాబు గొప్పతనాన్ని పొగిడేసిన తీరుతో తెలుగు తమ్ముళ్లు తెగ ఇదైపోతున్నారట. ఇలాంటి ఆలోచనలు తమకు రాలేదని ఫీలవుతున్న వారూ తక్కువేం లేరని తెలుస్తోంది.
ఇంతకీ శ్రవణ్ కవితా బిస్కెట్ చూస్తే..
‘‘సోడా బుడ్డి కళ్లద్దాలు పోతే. . రేబాన్ గ్లాసెస్ పెట్టినట్టు
పాత అంగీ లాగేస్తే.. పొందూరు ఖద్దరు తొడిగినట్టు..
మట్టిపలక పగిలిపోతే.. డిజిటల్ క్లాస్ రూమ్ వచ్చినట్టు
దేకుడంటే చూపమంటే.. రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు
దారులన్నీ మూసేస్తే.. వేసిన అడుగే హైవే అయినట్టు..
పదేళ్ల పందెంవేస్తే.. రెండేళ్లలోనే గెలిచి చూపినట్టు
అడ్రస్ గల్లంతు చేస్తామంటే.. దునియాకే డెస్టినీ అయినట్లు
టెంపరరీ శాంపిల్ కే కళ్లు చెదిరినట్లు.. అమరావతి అసెంబ్లీ అద్భుతమన్నట్లు’’
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/