లేడీ డాన్ సూసైడ్ ప్లాన్?

Update: 2017-08-24 13:17 GMT
ఎర్ర చందనం స్మగ్లర్ - లేడీ డాన్ సంగీత ఆత్మహత్యాయత్నం చేసింది.  కోల్ కతాకు చెందిన మోడల్ అయిన సంగీతా ఛటర్జీపై నాలుగు ఎర్ర చందనం కేసులు ఉన్నాయి. వీటిపై విచారణ కొనసాగుతోంది. చిత్తూరు సబ్ జైల్లో ఉన్న ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ... ఆమెకు బెయిల్ మంజూరు కావడం లేదు. తనకు బెయిల్ రాదనే నిరాశలో ఆమె  ఈ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సబ్ జైల్లోనే ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్తున్నారు. అయితే... ఆసుపత్రిలో చేరి తప్పించుకునే ప్లాన్ వేయడానికో.. లేదంటే బెయిల్ కోసం వేసిన ఎత్తుగడైనా కావచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
    
ఎర్రచందనం కేసులో పీడీ యాక్టుపై జైల్లో ఉన్న సంగీత చటర్జీ సబ్‌ జైల్లో టాయిలెట్‌ క్లినర్‌ తాగి బలవన్మరణానికి యత్నించింది. దీంతో అప్రమత్తమైన జైలు సిబ్బంది ఆమెను చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
    
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో కొన్ని నెలల క్రితం చిత్తూరు పోలీసులు కోల్‌ కతాలో ఆమెను అరెస్టు చేశారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్‌ మార్కొండ లక్ష్మణ్‌ రెండో భార్యే సంగీత. లక్ష్మణ్ జైల్లో ఉన్నప్పుడు సంగీతే మొత్తం చక్రం తిప్పేది.  లక్ష్మణ్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోఉన్నాడు.
    
మోడల్‌ గా - ఎయిర్‌ హోస్టెస్‌ గా పనిచేసిన సంగీతపై 2015లో చిత్తూరు జిల్లాలో రెండు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న సంగీతను ప్రత్యేక పోలీసు బృందం పక్కా ప్రణాళికతో మార్చి నెలలో కోల్‌ కతాలో అరెస్టు చేసి చిత్తూరుకు తీసుకొచ్చారు.
Tags:    

Similar News