తమ కరోనా వ్యాక్సిన రేటు చెప్పిన మోడెర్నా

Update: 2020-07-29 04:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్నా కరోనాకు చెక్ చెప్పే వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా 120కు పైగా ప్రయోగాలు సాగుతున్నాయి. అందులో ఇరవై ప్రయోగాల్నిచాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అందులో కొన్ని కంపెనీలు టాప్ ఫైప్ కంపెనీలుగా నిలుస్తున్నాయి. వీరు చేసే ప్రయోగాల మీద అందరూ ఆశలు పెట్టుకుంటున్నారు. మిగిలిన సంస్థలు తయారు చేసే కరోనా వ్యాక్సిన్ కంటే తమ వ్యాక్సినే పవర్ ఫుల్ గా చెబుతోంది అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ.

తాము తయారు చేస్తున్న  mRNA-1273 వ్యాక్సిన్ ధర ఒక్కో డోసు రూ.3745 నుంచి రూ.5వేల వరకు ఉంటుందన్న అంచనాను వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్తయారు చేసే ఇతర కంపెనీలతో పోలిస్తే.. దీని ధర ఎక్కువగా ఉండటం గమనార్హం. కరోనాకు చెక్ చెప్పాలంటే తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ను రెండు డోసులు వేసుకుంటే.. దీని నుంచి బయటపడొచ్చన్న మాటను చెబుతోంది కంపెనీ.

ఈ లెక్కన ఈ కంపెనీ వ్యాక్సిన్ వాడాలంటే దగ్గర దగ్గర రూ.ఎనిమిది నుంచి పదివేల రూపాయిల వరకు ఖర్చు అవుతుందని చెప్పక తప్పదు. అమెరికన్ కంపెనీలైన ఫిజెర్.. బయోన్టెక్ లు తయారు చేస్తున్న వ్యాక్సిన్ల కంటే తమదే శక్తివంతమైనదిగా చెబుతోంది. అయితే.. మోడెర్నా ప్రకటించిన వ్యాక్సిన్ ధర అమెరికాతో పాటు సంపన్న దేశాల్లో అమ్మే ధరగా చెబుతున్నారు. మరి.. పేద దేశాల్లో అమ్మే ధరను ఫైనల్ చేయలేదు. ఇదిలా ఉంటే ఫిజెర్.. మోడెర్నా.. మెర్క్ అండ్ కో లాంటి కంపెనీలన్ని వ్యాక్సిన్ మీద లాభాలు వేసుకొని మాత్రమే అమ్ముతామని చెబుతుంటే.. మరో ప్రముఖ బహుళ జాతి సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం అందుకు భిన్నంగా లాభాలు వేసుకోకుండా అమ్ముతామని చెబుతోంది. ఇదిలా ఉంటే.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ.. ఆస్ట్రాజెనెకా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ రూ.300లకే అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి 30 కోట్ల డోసులు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ లో భాగంగా అమెరికా ప్రభుత్వం ముందస్తుగా ఆ సంస్థలకు 1.2 బిలియన్ డాలర్లను సమకూర్చనుంది. కరోనా వ్యాక్సిన్ తయారు చేయటానికి ముందుకు వచ్చే కంపెనీలకు భారీ ఎత్తున ఆర్థిక సాయం ఇచ్చేందుకు సిద్ధం కావటమే కాదు.. ఇప్పటికే ఆచరణలో చూపించింది కూడా. మొత్తంగా చూస్తే.. కరోనా వ్యాక్సిన్ తయారీకి సంబంధించి రానున్న రోజుల్లో ధరల మీద భారీ ఎత్తున చర్చ జరగటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News