కేంద్రమంత్రి డ్యాన్స్ అదుర్స్ : మోదీ ఫిదా

Update: 2021-10-01 05:30 GMT
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ టూర్‌ లో ఉన్న కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. స్థానిక గ్రామ‌స్థుల‌తో క‌లిసి ఆయ‌న సాంప్ర‌దాయ స్టెప్పులేశారు. ఆ వీడియోను ఆయ‌న కూ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. క‌జలాంగ్ గ్రామానికి చెందిన సాజోలాంగ్ తెగ ప్ర‌జ‌ల‌తో క‌లిసి మంత్రి రిజిజు డ్యాన్స్ చేశారు. సాజోలాంగ్ తెగ ప్ర‌జ‌ల్ని మిజీల‌ని కూడా అంటారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ లో తెగ‌లు ఇలా సాంప్ర‌దాయ నృత్యాల‌ను ఎంజాయ్ చేస్తుంటార‌ని, వారితో క‌లిసి డ్యాన్స్ చేసిన‌ట్లు రిజిజు తెలిపారు.

అయితే రిజిజు డ్యాన్స్‌పై ప్ర‌ధాని మోడీ కామెంట్ చేశారు. మా న్యాయ‌శాఖ మంత్రి రిజిజు మంచి డ్యాన్స‌ర్ అంటూ త‌న ట్విట్ట‌ర్‌ లో మోడీ ఓ పోస్టు చేశారు. వైభ‌వ‌మైన‌ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సంస్కృతిని చూడ‌డం సంతోషంగా ఉంద‌ని మోడీ అన్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లానని,. ఎవరైనా అతిథులు తమ గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల ఆనందం ఇదని తెలిపారు. ఇక్కడి జానపద పాటలు, నృత్యాలు  అరుణాచల్‌ ప్రదేశ్‌ లోని సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు కిరణ్ రిజిజు.

దేశంలో నలుమూలలకూ, ప్రతి పౌరుడికీ వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకోసమే సరికొత్త జాతీయ ఆరోగ్య విధానానికి నడుంబిగించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి గుణపాఠం నేర్పిందని, దీని మూలంగా వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలకు పూనాది ఏర్పడిందన్నారు. కరోనాను అరికట్టేందుకు, ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు నిమగ్నమయ్యాని, ఈ తరుణంలో భారత్ బలాన్ని, స్వశక్తి పెంచుకునేందుకు ముందడుగువేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అత్యాధునిక ప్రమాణాలతో మెరుగైన వైద్య విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. అందుకే వైద్య కళాశాలలను విస్తరిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. గురువారం రాజస్థాన్‌ లో నాలుగు కొత్త వైద్య కళాశాలలకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. దీంతోపాటు జైపూర్ సీతాపురలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ టెక్నాలజీ (ఐపీటీ)ని కూడా ఆయన ప్రారంభించారు. మెడికల్ కాలేజీలను కొత్తగా రాజస్థాన్ లో ని బన్స్‌వారా, సిరోహి, హనుమాన్‌గఢ్, దౌసాలో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలు, ఇనిస్టిట్యూట్‌ గురించి ప్రెజెంటేషన్‌ ద్వారా చూపించారు.
Tags:    

Similar News