ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆషామాషీ కాదు. జాతీయ పార్టీకి చెందిన నేతలే అయి ఉండొచ్చు. ఒక రాష్ట్రానికి సీఎంగా పని చేసిన నేతను.. ఇట్టే మార్చేస్తున్న మోడీషాల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాజాగా అక్కడి సీఎం విజయ్ రూపాణిని ఇంటికి పంపి.. కొత్త ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టే కసరత్తు చేస్తున్నారు. ఆ మాటకు వస్తే గడిచిన ఆర్నెల్ల కాలంలో ఐదు రాష్ట్రాల్లోని బీజేపీ ముఖ్యమంత్రుల్ని మార్చేసిన వైనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఎందుకిలా? జరుగుతోంది? మోడీషాల వ్యూహం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
గుజరాత్ విషయానికి వస్తే.. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటం.. ఇప్పటికే మూడుసార్లు వరుస విజయాలు సాధించి.. బీజేపీకి కంచుకోటలా ఉన్న రాష్ట్రంలో విజయ్ రూపాణి మీద ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకూ పెరగటంతో నష్ట నివారణ ప్రయత్నాల్ని షురూ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే విజయ్ మీద వేటు వేసినట్లుగా చెబుతున్నారు. పార్టీ క్యాడర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటు.. తమకు వచ్చిన నివేదికల ఆధారంగానే ముఖ్యమంత్రిని మార్చాలని మోడీషాలు డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.
విజయ్ రూపాణీ ప్రభుత్వంలోని కొన్ని వైఫల్యాలు పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా చేయటమే కాదు.. ప్రత్యర్థులు పుంజుకోవటానికి అవకాశం ఇచ్చాయని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితే రానున్న రోజుల్లో కొనసాగితే.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందన్న ముందస్తుజాగ్రత్తతో తాజా మార్పు జరిగినట్లుగా తెలుస్తోంది.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా వచ్చే ఏడాది జరిగే కీలక రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు మారనున్నాయి. ఉత్తరప్రదేశ్.. గుజరాత్.. ఉత్తరాఖండ్.. గోవాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిల్లో మొదటి నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. అధికారపక్షంగా ఉండే సహజ వ్యతిరేకతను అధిగమించటానికి.. విజయాన్ని మరోసారి సొంతం చేసుకోవటానికి వీలుగా.. నాయకత్వ మార్పుతో అసంతృప్తిని అధిగమించాలని మోడీషాలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ ఏడాది జరిగిన ఐదు రాష్ట్రాల్లో సరైన ఫలితాలు రాని నేపథ్యంలో.. దాని నుంచి పాఠాలు నేర్చుకొని వచ్చే ఏడాదికి మరింత జాగ్రత్తగా వ్యవహరించి విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే.. నాయకత్వ మార్పు మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోపార్టీకి వీస్తున్న వ్యతిరేక గాలి నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా ఉందన్న విషయాన్ని తెలియజేసేలా తాజా చర్యలు ఉన్నాయని చెప్పొచ్చు.
తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని ఇట్టే మార్చేసే వైనానికి తెర తీసింది ఉత్తరాఖండ్ లోనే. అక్కడ సీఎంగా వ్యవహరిస్తున్న త్రివేంద్ర సింగ్ రావత్ ను తప్పించి.. ఆయన స్థానంలో తీరథ్ సింగ్ రావత్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే.. తాము ఆశించిన రీతిలో ఆయన పాలన లేకపోవటంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆయనపై వేటు వేసి.. పుష్కర్ సింగ్ ధమీని ముఖ్యమంత్రిని చేశారు. ఇలా నాలుగునెలల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మార్చిన వైనం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పుష్కర్ సింగ్ ధమీ నాయకత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోనున్నారు.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఎన్నికల వేళ పార్టీకి నాయకత్వం వహించిన నేతను వదిలేసి.. మరో నేతకు ముఖ్యమంత్రి అవకాశాన్ని ఇవ్వటం చాలా సాహసోపేతమైన చర్య. అసోంలో అలాంటి పనే చేసింది మోడీషాల ద్వయం. అసోంలో పార్టీని విజయతీరాలకు చేర్చిన ముఖ్యమంత్రి శర్బానంద సొనొవాల్ ను తప్పించి.. ఆయన స్థానంలో హిమంత బిశ్వశర్మకు అవకాశం ఇచ్చింది. అతగాడి పుట్టిల్లు కాంగ్రెస్ అయినా.. బీజేపీ సీఎంను చేయటానికి మోడీషాలు వెనుకాడలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి కుర్చీ నుంచి తప్పించిన శర్బానందను కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించారని చెప్పాలి.
కర్ణాటకలోనూ అలానే జరిగింది. ఎన్నికల్లో గెలుపు చేతి వరకు వచ్చి చేజారింది. ఇలాంటివేళ.. యడ్డీ నాయకత్వంతో ఆపరేషన్ కమల్ ను విజయవంతంగా పూర్తి చేసి.. సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి మరీ.. బీజేపీ అధికారాన్ని సొంతం చేసుకుంది. తాము అనుకున్నట్లుగా లక్ష్యానికి రీచ్ అయిన యడ్డీని సీఎంను చేశారు. కానీ.. మోడీషాలు ఆశించిన రీతిలో ఆయన పాలన లేదన్న కారణంగా ఆయన్ను పక్కన పెట్టేసి.. బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా పలు రాష్ట్రాల్లో సీఎంలను సింఫుల్ గా మార్చేసిన మోడీషాలు..తాజాగా తమ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోనూ ముఖ్యమంత్రిని కుర్చీలో నుంచి దించేశారు.
ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం ఎవరికి దక్కుతుందన్నది ప్రశ్నగా మారింది. రేసులో చాలాపేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, దాద్రా నగర్ హవేలి, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్, పర్షోత్తమ్ రుపాల, గుజరాత్ వ్యవసాయం-రవాణా శాఖ మంత్రి రణ్‌ఛోద్ భాయ్ ఛనాభాయ్ ఫాల్దు, గోర్ధాన్ జడాఫియాల పేర్లు వినిపిస్తున్నా.. మన్ సుఖ్ మాండవీయకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.