ఏ మాటకు ఆ మాటే చెప్పాలి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఉన్న గొప్ప గుణం ఒకటి చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి.. అదే పనిగా ఢిల్లీకి.. విదేశాలకు వెళ్లటం లాంటివి గులాబీ బాస్ కు తక్కువనే చెప్పాలి. కాకుంటే.. హైదరాబాద్ లో కంటే ఫాంహౌస్ లో ఎక్కువగా గడుపుతారన్న పేరుంది.
కీలకమైన సమయాల్లోనూ ఢిల్లీకి వెళ్లే విషయాన్ని లైట్ తీసుకునే కేసీఆర్.. ఊహించని రీతిలో ఢిల్లీ టూర్ ను తెర మీదకు తెస్తుంటారు. తాజా టూర్ కూడా ఆ కోవకు చెందిందిగా చెప్పక తప్పదు. మొన్నటివరకూ మోడీ అపాయింట్ మెంట్ ను ఫిక్స్ చేసుకునే విషయంలో కేసీఆర్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారన్న మాట వినిపిస్తూ ఉండేది.
తాజాగా ఆ లోటును తీరుస్తూ.. ప్రధాని మోడీతో అపాయింట్ మెంట్ ఫిక్స్ కావటంలో.. భేటీకి డిసైడ్ చేసిన సమయానికి ఒక పూట ముందే ఢిల్లీలో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి.. సాయంత్రం ఆరు గంటలకు దేశ రాజధానికి చేరుకున్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో భేటీకి అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది.
కానీ.. గురువారం రాత్రి చోటు చేసుకున్న మార్పులతో కేసీఆర్ తో ప్రధాని భేటీని మార్పులు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేసీఆర్ కు అందించింది ప్రధాని కార్యాలయం. ముందుగా అనుకున్నట్లు శుక్రవారం ఉదయం 11 గంటలకు కాక.. సాయంత్రం 4.30 గంటలకు భేటీ కానున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని గురువారం రాత్రి కేసీఆర్ టీంకు అందజేశారు.
ఢిల్లీకి చాటంత కోర్కెల లిస్టుతో ఢిల్లీలో అడుగు పెట్టిన ఆయనకు.. గంటల వ్యవధిలోనే ఝులక్ ఇస్తూ.. అపాయింట్ మెంట్ టైంను మార్చటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. మోడీతో భేటీ కోసం ముందే వచ్చేసిన కేసీఆర్ కు తాజా పరిణామం షాకింగ్ గా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.