ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావటం తెలిసిందే. దాదాపు గంట పాటు మోడీతో మాట్లాడిన జగన్.. ఏపీలో నెలకొన్న పరిస్థితులు..ఏపీ అవసరాలు.. ప్రత్యేక హోదా అంశాలతో పాటు.. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి గురించి చెప్పటమే కాదు.. ఆయన సర్కారు.. ఆయన మంత్రివర్గంలోని వారి అవినీతి గురించి వివరంగా చెప్పినట్లుగా చెప్పారు. బాబు అవినీతిపై ప్రచురించిన పుస్తకాన్ని మోడీ చేతిలో పెట్టిన సంగతి తెలిసిందే.
ఇదంతా తెలిసిన ముచ్చటే అయినా.. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. జగన్ తో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ.. బాబు గురించి ఆసక్తికర ప్రశ్న ఒకటి వేసిన విషయాన్ని ఏపీ విపక్ష నేత చెప్పుకొచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన జగన్ మాటల్లో ఈ విషయం బయటకు వచ్చింది.
దాదాపు గంట పాటు ప్రధానితో భేటీ సందర్భంగా పలు విషయాలు తమ చర్చకు వచ్చాయని.. ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోడీతో దాదాపు 15 నిమిషాలు మాట్లాడినట్లుగా జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీకి రూ.4లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారని.. రూ.10లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశామన్నారు.. నిజమేనా జగన్ అని ప్రధాని మోడీ అడిగినట్లుగా జగన్ చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని విషయాలతో పాటు.. ఆగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెప్పారు. బాబు ఏరకంగా అన్యాయమైన పాలనను సాగిస్తున్నారు.. ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు? ఏ విధంగా ఎన్ సీఏఆర్ అవినీతిలో ఏపీ నెంబర్ వన్ అన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. కాగ్ ఎలాంటి నివేదికలు ఇచ్చింది చెప్పానన్నారు. రాజధాని ప్రాంతంలో బాబు కుంభకోణాల్ని కూలంకూషంగా చెప్పినట్లుగా వెల్లడించారు.
తాను మోడీని కలిసిన తర్వాత టీడీపీ నేతల ప్రతిస్పందన చూస్తే ఆశ్చర్యం వేస్తుందని.. హఠాత్తుగా ప్రధాని మోడీ అంటరానివాడయ్యారని.. జగన్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వటం ఏమిటని అడుగుతున్నారన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/