అవినీతి పరుల ఆట కట్టించటానికి.. నల్లకుబేరులకు భారీ షాక్ ఇవ్వటానికే పెద్దనోట్ల రద్దు నిర్ణయమని చెప్పినప్పటికీ.. దాని అసలు కారణం వేరే ఉందన్న విషయం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో స్పష్టమవుతున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే.. పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకోవటం.. ఇందుకు తగ్గట్లు పలు నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ సర్కారు.. తాజాగా భీమ్ యాప్ ను విడుదల చేసింది.
ప్రధాని విడుదల చేసిన ఈ భీమ్ యాప్ లో ప్రత్యేకత ఏమిటంటే..ఈ యాప్ ను వినియోగించటానికి ఇంటర్నెట్ అవసరం లేదు. వినియోగదారులు తమ డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని భీమ్ యాప్ ద్వారా లావాదేవీల్ని పూర్తి చేసుకునే వీలుంది. ఇంతకీ ఈ భీమ్ యాప్ ఏమిటి? దీనికి డిజిటల్ లావాదేవీలతో సంబంధం ఏమిటి? ఇదెలా పని చేస్తుంది? దీన్ని డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా కలిగే లాభం ఏమిటి? లాంటి అంశాల మీద ఫోకస్ చేస్తే..
1. భీమ్ యాప్ ప్రస్తుతం అండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఐవోఎస్ వెర్షన్ త్వరలో విడుదల కానుంది.
2. ఈ యాప్ వినియోగానికి స్మార్ట్ ఫోన్ అవసరం లేదు.
3. పేమెంట్ల కోసం భీమ్ యాప్ వినియోగానికి ఏ మోడల్ మొబైల్ నుంచైనా ఆపరేట్ చేసే వీలుంది.
4. ఏ మొబైల్ నుంచైనా *99# కు డయల్ చేసి.. తర్వాత మెనూ మనకు కనిపిస్తుంది. నగదు పంపటానికి.. బ్యాలెన్స్ చెక్ చేయటానికి వివిధ ఫీచర్లు వినియోగించటానికి వీలుగా పలు నెంబర్లు కనిపిస్తాయి. వీటి సాయంతో మన బ్యాంకింగ్ లావాదేవీల్ని పూర్తి చేయొచ్చు.
5. వినియోగదారులు ఏదైనా షాప్ కు వెళ్లి వారి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే అవకాశాన్ని ఈ యాప్ అందిస్తుంది.
6. వ్యాపారి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా.. నగదు చెల్లించే వీలుంది.
7. అంతేకాదు.. కేవలం మొబైల్ నెంబరు నుంచి సైతం నగదు బదిలీ చేసుకునే వెసులుబాటు ఈ యాప్ తో ఉంది. అంటే.. దుకాణదారు కానీ ఈ యాప్ వాడుతుంటే.. అతని ఫోన్ నెంబరు టైపు చేసి.. సెండ్ చేస్తే చాలు వినియోగదారుడి ఖాతాలో నగదు డెబిట్ అయి.. వ్యాపారి ఖాతాకు క్రెడిట్ అవుతుంది.
8. ఈ యాప్ తో రూ.10వేల వరకు లావాదేవీల్ని చేసుకునే వెసులుబాటు ఉంది. రోజుకు రూ.20వేల వరకు లావాదేవీల్ని జరుపుకోవచ్చు.
9. అందుబాటులో ఉన్న మొబైల్ వాలెట్లలో అయితే.. మొదట ఆ వాలెట్లలో నగదు నింపిన తర్వాత వాడుకునే వీలుంది. కానీ.. ఈ యాప్ లో అలాంటిదేమీ ఉండదు. ఈ యాప్ ను డెబిట్ కార్డు మాదిరి ఉపయోగించేవీలుంది.
10. ఈ యాప్ లో ఎస్ బీఐ.. ఐసీఐసీఐ.. యక్సిస్.. హెచ్ డీఎఫ్ సీ లాంటి పెద్ద బ్యాంకులతో పాటు.. యూపీఐ కనెక్ట్ అయ్యే బ్యాంకులన్నీ భీమ్ యాప్ తో యాక్సిస్ చేసుకోవచ్చు. యూపీఏతో సంబంధం లేని బ్యాంకులు కూడా ఐఎఫ్ ఎస్ సీ కోడ్ తో బీమ్ ద్వారా నగదు పొందే వీలుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/