మోడీలో ఎంత పెద్ద బిజినెస్‌మ్యాన్‌ ఉన్నాడంటే..

Update: 2015-04-09 08:57 GMT
ప్రధానమంత్రి మోడీ గురించి తెలియని వారు లేరు. గుజరాతీకి సహజంగా ఉండే వ్యాపార తెలివితేటలు మోడీలో చాలానే ఉన్నాయని తెలుసు. కానీ.. అవి ఏ రేంజ్‌లో ఉన్నాయన్న విషయం తాజాగా ఆయన చెప్పిన మాటల్ని వింటే ఇట్టే అర్థమైపోతుంది.

ఒక పెద్ద బిజినెస్‌ మాగ్నేట్‌కు తలపించేలా ఆయన ఆలోచనలు కనిపిస్తాయి. ఒక సాదాసీదా రైతుకు.. ఒక వ్యాపారస్తుడికి మధ్యనున్న వ్యత్యాసాన్ని వివరిస్తూ.. బిజినెస్‌ను ఎలా డెవలప్‌ చేయాలో ఆయన చెప్పిన ఉదాహరణ ఆకర్షణీయంగా ఉండటమే కాదు.. మరెంతో స్ఫూర్తినిస్తుంది.

ఇంతకీ మోడీ చెప్పిన ఆ మాటలేమంటే.. ''ఒక చిరు వ్యాపారి మామిడికాయల్ని మాత్రమే అమ్ముకుంటే తక్కువ లాభం వస్తుంది. ఆ కాయల్ని ఉపయోగించి అవకాయ పచ్చళ్లు పెట్టగలిగితేఎక్కువ డబ్బు వస్తుంది. అదే పచ్చళ్లను అందమైన సీసాలో నింపి.. అమ్మితే మరింత ఆదాయం వస్తుంది. ఆ సీసాను ఒక అమ్మాయి చేతిలో పెట్టి.. చక్కటి యాడ్‌ తయారు చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి'' అంటూ మామిడికాయతో ఎన్ని రకాల వ్యాపారాలు చేయొచ్చో.. ఎంతగా డబ్బు సంపాదించవచ్చో వివరంగా చెప్పుకొచ్చారు.

పేరుకు మామిడికాయే అయినా.. ఏ రేంజ్‌ వ్యాపార అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మోడీ ఎంత బాగా చెప్పారు. కనిపించే ప్రతి వస్తువు వెనుక ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయన్న విషయాన్ని మోడీ చెప్పిన తీరు ఒక విజయవంతమైన బిజినెస్‌మ్యాన్‌ చెప్పినట్లే ఉంది  కదూ.

Tags:    

Similar News