సినిమాల్లో రాజమౌళి-వర్మ, రాజకీయాల్లో నేను-కేటీఆర్: రేవంత్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరికి ఉండే స్టయిల్ వారికి ఉంటుందన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరికి ఉండే స్టయిల్ వారికి ఉంటుందన్నారు. అందరూ ఒకేలా రాజకీయాలు చేయరని చెప్పారు. ``మీరు చూడండి.. సినిమాల్లో రాజమౌళిగారు ఒక రకంగా సినిమలు చేస్తారు. రాంగోపాల్ వర్మ మరో రకంగా తీస్తారు. ఇద్దరూ దర్శకులే అయినా.. స్టయిల్ వేరువేరుగా ఉంటుంది. రాజకీయాల్లో నా స్టయిల్ నాది. కేటీఆర్ స్టయిల్ కేసీఆర్‌ది`` అని వ్యాఖ్యానించారు.
ఒకరి రాజకీయాలను ఒకరు విమర్శించడం.. పేర్లు పెట్టడం అనేది సరికాదన్నారు. సోమవారం.. కేటీఆర్ స్పందిస్తూ.. `రేవంత్‌రెడ్డి రాక్షస రాజకీయాలుచేస్తున్నారు`` అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనికి కౌంటర్‌గా రేవంత్ ఇలా వ్యాఖ్యానించారు. రాజకీయాలు మారిపోయాయని.. ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్నారని చెప్పారు. గతంలో ఒక సిద్ధాంతం.. ఒక పద్ధతి ఉండేదన్నారు. ప్రస్తుతం అలాంటివి ఏమీ లేవని, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు అసలు ఎలాంటి సిద్ధాంతాలూ లేవన్నారు.
తమది జాతీయ పార్టీ అని.. దీంతో తమకు కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇదిలావుంటే.. రాజకీయంగా ఇక, కేసీఆర్‌ను పక్కన పెట్టేస్తున్నట్టు చెప్పారు. ఆయన పని అయిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. పోతూ పోతూ.. ఆయన తెలంగాణ సమాజంపై 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టిపోయారని చెప్పారు. వీటికి వడ్డీలు, అసలు కడుతున్నట్టు చెప్పారు. అసలు రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగిలు బడ్జెట్‌లో ఉన్నదని మరి అప్పులు చేసి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. 50 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇంకా ఇస్తున్నట్టు చెప్పారు. మరో నాలుగు సంవత్సరాల పాటు తమకు అధికారం ఉందని.. ప్రజలకు ఇంకా మేలు చేసేందుకు తమకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదని, రాజకీయంగానే కేటీఆర్ వంటివారికి ఇబ్బందులు ఉన్నాయని.. అందుకే ప్రజాస్వామ్యంఏదో అయిపోతోందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.