ప్లే స్టోర్ లలో డీప్ సీక్ దూకుడు మామూలుగా లేదుగా?

గడిచిన మూడు నాలుగు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది డ్రాగన్ దేశానికి చెందిన డీప్ సీక్.

Update: 2025-01-30 04:37 GMT

గడిచిన మూడు నాలుగు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది డ్రాగన్ దేశానికి చెందిన డీప్ సీక్. ఈ ఏఐ స్టార్టప్ టెక్ దిగ్గజ సంస్థలకు చెందిన ఏఐ ప్లాట్ ఫాంతో పోటీ పడటమే కాదు.. డౌన్ లోడ్లలో వారిని సైతం అధిగమించేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఈ సంస్థకు చెందిన ఆర్1 మోడల్ విడుదలతో మొత్తం టెక్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ స్టార్టప్ సంస్థ.. ప్లే స్టోర్ లలో డౌన్ లోడ్లతో ఇరగదీస్తోంది.

అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్ లో ప్రస్తుతం ఫ్రీ యాప్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్ జీపీటీ రెండో స్థానంలో ఉంది. డీప్ సీక్ దూకుడు ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచంలోని 51 దేశాల్లోనూ నడుస్తోంది. ఈ యాభై ఒక్క దేశాల్లోని ప్లే స్టోర్ లో అగ్రస్థానంలో నిలవటం గమనార్హం. యాప్ ఫిగర్స్ సంస్థ లెక్కల ప్రకారం చూస్తే.. 51 దేశాల ప్లే స్టోర్ లో.. 111 దేశాల్లో యాపిల్ యాప్ స్టోర్ లోనూ.. 18 దేశాల్లో గూగుల్ ప్లే స్టోర్ లో టాప్ 10 జాబితాలో కంటిన్యూ అవుతున్నట్లుగా పేర్కొన్నారు.

డీప్ సీక్ కు మొత్తం డౌన్ లోడ్లలో 80 శాతం గడిచిన వారంలో రావటం గమనార్హం. ఒక్క భారతదేశంలోనే కోటికి పైగా డౌన్ లోడ్లు వచ్చాయని.. మొత్తం డౌన్ లోడ్లలో చైనా వాటా అధికంగా ఉందని చెబుతున్నారు. మొత్తం డౌన్ లోడ్లలో 23 శాతం ఉంటుందని చెబుతున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన డీప్ సీక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సంస్థను చూసి దిగ్గజ టెక్ సంస్థలు తమ ఆవిష్కణలకు.. పరిశోధనలకు తక్కువ ఖర్చు చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన చేయటం గమనార్హం.

అయితే.. యాప్ తో ఉండే తలనొప్పి ఏమంటే.. చైనా.. చైనాకు వ్యతిరేకంగా ఉండే అంశాలు.. చైనా వివాదాస్పద నిర్ణయాలు.. చైనా ఇమేజ్ ను డ్యామేజ్ చేసే అంశాల గురించి మాత్రం పెదవి విప్పటం లేదు. ఈ అంశాలు తమ పరిధిలో లేవంటూ ఇస్తున్న సమాధానాలు పలువురికి నచ్చట్లేదు. సమాచారం ఇవ్వటంలోనూ తమను తాము నియంత్రించుకుంటున్న తీరు.. బాగోలేదన్న మాట వినిపిస్తోంది. దీని హడావుడి పాల పొంగులా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News