మంగళవారం మధ్యాహ్నం వార్తా చానళ్లు చూస్తున్న వారు కాసేపు ఆసక్తిగా చూస్తుండిపోయే పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రధానమంత్రి మోడీ ఫోన్ చేసిన వైనాన్ని బ్రేకింగ్ న్యూస్ కింద వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబుకు ప్రధాని ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నతో పాటు.. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న ఆసక్తి వ్యక్తమైంది. ఇంతకీ ప్రధాని మోడీకి చంద్రబాబుకు ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చారన్న సందేహం కలిగింది.
బాబుతో ఫోన్లో ప్రధాని మాట్లాడారన్న బ్రేకింగ్ న్యూస్ పదే పదే చూపించిన చానళ్లు అసలు కారణాన్ని మాత్రం తాపీగా చూపించారు. ఇంతకూ విషయం ఏమంటే.. ప్రధాని మోడీతో మాట్లాడాలనుకుంటున్నట్లుగా పీఎంవోకు సమాచారం ఇచ్చారు చంద్రబాబు. దీంతో మోడీనే బాబుకు ఫోన్ చేశారు. దీనికి ముందు తమ పార్టీకి సంబంధించి ఏర్పాటు చేసిన సంస్థ (గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్సఫర్మేషన్) కరోనా మీద తయారు చేసిన నివేదికను చంద్రబాబు పీఎంవోకు పంపారు.
తనతో మాట్లాడాలనుకుంటున్న బాబు రిక్వెస్టు తెలిసిన వెంటనే మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా మోడీ వేసిన తొలి ప్రశ్నతోనే బాబు త్రోటుపాటుకు గురైనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. మోడీ అడిగిన ప్రశ్న అలాంటిది. క్యాజువల్ గానే అడిగినట్లు ఉన్నా.. ప్రధాని అడిగిన ప్రశ్నతో ఆత్మరక్షణలో పడినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ప్రధాని అడిగిన ప్రశ్నేమంటే.. బాబు.. ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారని?
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సింది. కానీ.. అనూహ్యంగా లాక్ డౌన్ తో బాబు హైదరాబాద్ లోనే ఉండాల్సి రావటం.. ఒకవేళ ఏపీకి వెళితే పద్నాలుగు రోజులు క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో.. వారు భాగ్యనగరంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. అయితే.. ప్రధానమంత్రితో ఈ విషయాన్ని వివరంగా చెప్పే అవకాశం ఉండదు. ఈ కారణంతోనే మోడీ అడిగిన ఎక్కడున్నారన్న ప్రశ్నకు ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది.
విపత్కర పరిస్థితుల్లో మోడీ బాగా పని చేస్తున్నారని చెబుతూ.. ఒక సలహాను ఇచ్చారు. జిల్లాను యూనిట్ గా తీసుకోవాలని.. ఆ జిల్లాలో ఆఖరి కేసు వెలుగులోకి వచ్చాక మరో 14 రోజుల వరకూ కొత్త కేసు నమోదు కాకుంటే అప్పుడు గ్రీన్ జోన్ చేసి నిబంధనల్ని సడలించాలని కోరారు.అదే సమయంలో కేసుల నమోదు కొనసాగుతుంటే రెడ్ జోన్లుగా ప్రకటించి మరింత కఠినంగా అమలు చేయాలని.. పరీక్షల సామర్థ్యం.. మౌలిక వసతులు మరింత పెంచాలన్న సూచనలు చేశారు. ఇవి చాలా మంచి సూచనలుగా మోడీ పేర్కొన్నట్లుగా చంద్రబాబు చెప్పారు. ఏమైనా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాట్లాడుకోని మోడీ.. బాబులు కరోనా వేళ మాట్లాడుకున్నారు. వారి ఫోన్ సంభాషణ మొత్తం కరోనా చుట్టూనే తిరిగినట్లు చెబుతున్నారు.