యోగీ బ‌ర్త్ డేః విష్ చేయ‌ని మోడీ.. కార‌ణం అదేనా?

Update: 2021-06-06 09:30 GMT
దేశంలోని బీజేపీ ముఖ్య‌మంత్రుల్లో ప్ర‌త్యేకంగా నిలిచే సీఎం యోగీ. దానికి ప‌లు కార‌ణాలున్నాయి. అయితే.. యోగీ సీఎం సీట్లో కూర్చోవ‌డంలో ప్ర‌ధాని మోడీ పాత్ర చాలా ఉందని చెబుతారు. అలాంటి మోడీ.. యోగీని విష్ చేయ‌లేదు. నిన్న (జూన్ 5) యోగీ పుట్టిన రోజు. అయితే.. అంద‌రికీ ట్విట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు చెప్పే మోడీ.. యోగీకి మాత్రం చెప్ప‌లేదు. దీంతో.. ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ మొద‌లైంది.

చాలా మంది మోడీ-యోగీ మ‌ధ్య చెడింద‌నే అభిప్రాయం వ్య‌క్తంచేశారు. దానికి కార‌ణాలు కూడా చూపించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హిందూత్వ వాదానికి బ‌ల‌మైన ప్రాంతంగా భావిస్తుంటుంది బీజేపీ. రామ‌జ‌న్మ‌భూమి అయోధ్య కూడా ఆ రాష్ట్రంలోనే ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించింది బీజేపీ. అయితే.. ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం త‌ల‌కిందులైపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘోర ప‌రాజ‌యం చ‌విచూసింది.

రామాల‌యం నిర్మిస్తున్న అయోధ్య‌లోనూ, మోడీ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలోనూ ఓడిపోయింది. మెజారిటీ స్థానాలు విప‌క్షాలు సొంతం చేసుకున్నాయి. దీంతో.. బీజేపీ నేత‌లు మొద‌లు సంఘ్ నాయ‌క‌త్వం వ‌ర‌కు షాక్ తిన్నారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండ‌డంతో ఒక‌ర‌క‌మైన భ‌యం కూడా వారిని వెంటాడుతోంది. ఈ ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు ఇటీల బీజేపీ-సంఘ్ నేత‌లు వ‌రుస‌గా స‌మావేశాలు కూడా నిర్వ‌హిస్తున్నారు.

ఈ వైఫ‌ల్యానికి యోగీనే బాధ్య‌త‌వ‌హించాల‌ని అంటున్నార‌ట‌ ప‌లువురు నేత‌లు. ఈ కార‌ణం వ‌ల్ల‌నే మోడీకి-యోగీకి మ‌ధ్య సంబంధాలు చెడిపోయాయ‌ని, అందుకే శుభాకాంక్ష‌లు కూడా చెప్ప‌లేద‌ని అంటున్నారు. ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌కు దారితీయ‌డంతో పీఎంవో స్పందించాల్సి వ‌చ్చింది. అలాంటిది ఏమీ లేద‌ని చెప్పింది.

గ‌డిచిన కొంత కాలంగా చాలా మంది ముఖ్య‌మంత్రుల పుట్టిన‌రోజులు వ‌చ్చాయ‌ని, కానీ.. వారెవ్వ‌రికీ మోడీ శుభాకాంక్ష‌లు చెప్ప‌లేద‌ని తెలిపింది. యోగీ విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ని చెప్పుకొచ్చింది. అయితే.. ఫోన్ ద్వారా యోగీకి గ్రీటింగ్స్ చెప్పార‌ని క్లారిటీ ఇచ్చింది. దీంతో.. ఈ సందేహానికి స‌మాధానం దొరికిన‌ట్ట‌య్యింది.
Tags:    

Similar News