మోడీ దెబ్బకు అమరావతి విలవిల

Update: 2017-01-05 16:31 GMT
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం పుణ్యమా అని ఏపీకి పడిన దెబ్బ అంతా ఇంతా కాదని చెబుతున్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో క్యాష్ ఫ్లో మీద తీవ్ర ప్రభావితం కావటం.. లావాదేవీలన్నీ ఎక్కడికక్కడ బంద్ అయిన పరిస్థితి. దీంతో.. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితి. చేతిలో డబ్బుల్లేక విలవిలలాడుతున్న కారణంగా.. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిపై రద్దు ఎఫెక్ట్ ఓ రేంజ్లో పడినట్లు చెబుతున్నారు.

నోట్ల రద్దు కారణంగా దేశంలో చెలామణిలో ఉన్న 86 శాతం పెద్ద నోట్లు బ్యాంకుల్లోకి వెళ్లిపోవటం.. లావాదేవీలపై పెద్ద కన్ను వేసుకున్న ప్రభుత్వ తీరు పుణ్యమా అని.. గతంలో మాదిరి తొందరపడి భారీ మొత్తాలకు లావాదేవీలు జరపలేని పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దు ముందు వరకు అమరావతిలోని కీలకమైన తుళ్లూరులో ఎకరా భూమి మూడు కోట్ల రూపాయిల వరకూ పలికేది. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు వరకూ ఈ ప్రాంతంలో ఎకరం రూ.8లక్షల కూడా పలికేది కాదు.

ఇంత భారీగా కాకున్నా.. ఓ స్థాయిలో వెలగపూడి.. ఉండవల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ బూమ్ ఓ రేంజ్లో ఉండేది. అమరావతి కోర్ క్యాపిటల్ సిటీగా పేరున్న ప్రాంతాల్లో భూమి ధర భారీగా ఉండేది.  అయితే.. ఎప్పుడైతే పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారో.. అప్పటి నుంచి ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యవహారాలు దారుణంగా పడిపోవటం గమనార్హం.

కొనేవారు ఎవరూ ముందుకు రాకపోవటం.. రానున్న మరికొద్ది నెలల్లోనూ ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉండటంతో భూముల ధరలు భారీగా పతనమైనట్లుగా చెబుతున్నారు. తూళ్లురులో ఇప్పుడు ఎకరం రూ.60 లక్షలకు అమ్మే వారు సిద్ధంగాఉన్నా.. కొనే వారు రెఢీగా లేరని చెబుతున్నారు. చేతుల్లో క్యాష్ మొత్తం బ్యాంకుల్లోకి చేరిపోవటంతో నగదు కొరత భారీగా మార్కెట్ లో ఉంది. దీంతో.. పెద్ద మొత్తాలతో లావాదేవీలు జరిపేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయకపోతున్నారు. దీంతో.. అమరావతి ప్రాంతంలో రియల్ లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. ఇది మొత్తంగా అమరావతి అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News