ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సిద్ధాంత పరంగా, అనేక విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో తనకున్న పట్టును కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తుంటే...ప్రత్యేక రాష్ట్రం లో పుంజుకోవాలని కాషాయ పెద్దలు తల పోస్తున్నారు. ఈ రాజకీయ ఎత్తుగడల విషయాన్ని అలా ఉంచితే...ఈ ఇద్దరు నేతలు తమను ప్రశ్నించే తత్వాన్ని..తమపై అధికారం చెలాయించాలని ఇతరులు భావించే ఆలోచన ను ఎట్టి పరిస్థితుల్లోనూ జీర్ణించుకోరని తాజా సంఘటలన తో రుజువైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమదే పై చేయిగా ఉండాలే తప్పించి...తమపై ఇంకొకరి..ఇంకా చెప్పాలంటే తమ కంటే చిన్నవారు అజమాయిషీ చెలాయించవద్దని ఈ ఇద్దరు నేతలు కోరుకుంటున్నట్లు చెప్తున్నారు.
రాష్ట్రం విషయానికి వస్తే..తెలంగాణ లో దాదాపు 52 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయం లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిపట్టు తో ఉన్నారు. ``సమ్మె పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తారా? కార్మిక సంఘాలు అసలు అవసరమా? ఉంటే సమస్యలను ప్రస్తావించాలే కానీ...ప్రతిపక్షాలతో కలిసి సమ్మె చేస్తారా? ప‌్రభుత్వాన్ని బెదిరిస్తారా? అలా చేస్తే..ఏమవుతుందో వారికి తెలిసిరావాల్సిందే``అని పేర్కొంటూ... అత్యంత కఠినంగా ఉంటున్నారు. అంతేకాకుండా ఒక్క ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లోకి తీసుకుంటే...మిగతా కార్పొరేషన్ల వారు సైతం ఇదే అడుగుతారని ఆయన స్వయంగా ప్రకటించారు. అంటే డిమాండ్ల ను ఆదిలోనే తుంచేశారన్నమాట.
సరిగ్గా ఇదే థియరీని...ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర లో అమలు చేస్తున్నారని అంటున్నారు. మరాఠా పార్టీ అయిన శివసేన విషయం లో ఈ విషయం స్పష్టమవుతుందంటున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందే శివసేన తో బీజేపీ పొత్తు పెట్టుకుంది, సీట్ల సర్దుబాటు చేసుకొని ఎన్నికల్లో గెలిచింది. అయితే ఫలితాల తర్వాత శివసేన అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబట్టడం మోడీకి మంటెక్కించిందంటున్నారు. జాతీయ పార్టీ తాముండగా ఓ ప్రాంతీయ పార్టీ తమపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నాన్ని మొగ్గలోనే తుంచేయాలన్న ఆలోచన చేశారని అంటున్నారు. అందులో భాగంగానే, శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్‌లు ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంటే....అదే సమయం లో ఎన్‌సీపీలోని ద్వితీయ శ్రేణి నాయకుల తో మంతనాలు జరిపి వారిని లాగేసి తమ సర్కారును బీజేపీ ఏర్పాటు చేసింది. తద్వారా ప్రాంతీయ పార్టీలంటే...తమ సైగలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది.