మధ్యతరగతికి మోడీ వరాలు.. 3 కీలక నిర్ణయాలు

Update: 2021-01-22 09:10 GMT
కరోనా కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం తీసుకురాబోతున్న బడ్జెట్ పై జనాల్లో భారీ అంచనాలున్నాయి. కోవిడ్ 19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఈసారి బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. పీపీఎఫ్ కు సంబంధించి బడ్జెట్ లో కీలక ప్రతిపాదన ఉండొచ్చనే అంచనాలు నెలకొంటున్నాయి.

కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో కీలక ప్రతిపాదన చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి. పీపీఎఫ్ ఇన్వెస్ట్ మెంట్ పరిమితిని రెట్టింపు చేసే చాన్స్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మాత్రమే డబ్బులు పెట్టుబడికి వీలుంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి. ఐసీఏఐ ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపినట్టు తెలిసింది.

ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తే మధ్యతరగతికి భారీ ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. పన్ను చెల్లింపుదారులకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచితే.. వారి సేవింగ్స్ కూడా పెరుగుతాయని ఐసీఏఐ తెలిపింది.

కరోనా కారణంగా వైద్యఖర్చులు పెరిగిపోయాయి. ఇన్సూరెన్స్ చెల్లింపుపై కూడా రూ25వేల మినహాయింపు సరిపోదని.. మెడికల్ కవరేజ్ మొత్తంపై మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది.




Tags:    

Similar News