అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆచితూచి అన్నట్లు ఉండాలి. అదే పనిగా మిడిసిపడకూడదు. అత్యుత్సాహాన్ని అస్సలు ప్రదర్శించకూడదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నట్లుగా అధికారంలో ఉన్న వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రజల మనసుల్ని దోచుకునే అవకాశం ఉంటుంది.ఎన్నికల వేళలో ప్రత్యర్థులను ఉద్దేశించి ఎడాపెడా మాట్లాడేసే మోడీ.. ఎన్నికల్లో విజయం సిద్దించిన వెంటనే ఆయన మూడ్ మారిపోతుంది.
విలువల గురించి చెబుతూ.. క్రమశిక్షణతో ఉండటం.. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఎలా వ్యవహరించాలన్న విషయంపై నీతులు చెబుతుంటారు. అలాంటి ఆయనకు.. ఇటీవల తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ అనే నేత క్రికెట్ బ్యాట్ పట్టుకొని నడి రోడ్డు మీద అధికారుల్ని ఉరికించి.. ఉరికించి కొట్టిన వైనం వైరల్ కావటమే కాదు.. కమలనాథుల రాజకీయం ఎలా ఉంటుందో దేశ ప్రజలకు అర్థమైన పరిస్థితి.
ఇలాంటి ఉదంతాలు ప్రభుత్వానికే కాదు పార్టీ ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేస్తాయన్న విషయాన్ని గుర్తించిన మోడీ.. తనకు తానే రియాక్ట్ అయ్యారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ సమావేశంలో ఫైర్ అయిన ఆయన.. తమ పార్టీ ప్రజాప్రతినిధులకు కొత్త పద్దతిలో క్లాస్ తీసుకునే పనిని షురూ చేశారు.
ఇందులో భాగంగా ఈ రోజు (బుధవారం) ఉదయాన్నే 80 మంది ప్రజాప్రతినిధులకు కబురు పంపారు. తన ఇంటికి రావాలన్నారు. ఇంటికి వచ్చిన వారికి క్రమశిక్షణతో ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. ఆకాశ్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ఎలాంటి నడవడిక ఉండాలన్న విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఘాటుగా మాట్లాడినట్లు తెలిసింది.
పార్టీకి చెడ్డపేరు తెచ్చే నేతలు ఎలాంటి వారైనా సహించేది లేదని.. దాని కారణంగా ఒక ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వస్తే అందుకు కూడా తాను సిద్ధమేనని చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆకాశ్ ఉదంతాలు మరోసారి జరగకుండా చూసుకోవాలని.. అలాంటిదే జరిగితే కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తానికి ఇంటికి పిలిచి మరీ క్లాస్ పీకిన వైనం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.