దేశంలోని మోడీ సర్కార్ పెట్రో, గ్యాస్ సహా నిత్యావసరాలపై ధరల మోత మోగిస్తోంది. తగ్గేదే లే అంటూ పెట్రోల్ ధరలను రూ.100 దాటించింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా దేశంలో పెట్రోల్ రేట్లు భగ్గుమంటున్నాయి. దానికి దేశభక్తిని లింకు పెట్టి బీజేపీ అభిమానులు చేస్తున్న ప్రచారం చూసి సగటు వినియోగదారుడు కక్కలేక మింగలేక భరిస్తున్నాడు.
అయితే పెట్రోల్ పై గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు మేం చెల్లిస్తున్నామని చెబుతున్న మోడీ సర్కార్ ఆ భారాన్ని అంతా వినియోగదారుడిపై వేయడం భావ్యమా? అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు అప్పులు చేస్తే.. ప్రజలకు తిప్పలా? అని నిలదీస్తున్నారు.
గత యూపీఏ ప్రభుత్వం పెట్రో బాండ్ల పేరుతో రూ.1.34 లక్షల కోట్లను సేకరించింది. దీనికి సంబంధించిన చెల్లింపులు ఈ ఏడాది నుంచే మొదలు అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు బాండ్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10వేల కోట్లు. అలాంటప్పుడు సరిగ్గా రూ.10వేల కోట్లు కాకున్నా రూ.15వేల కోట్ల వరకూ వసూలు చేయవచ్చు. అప్పులను తీర్చవచ్చు. కానీ కేంద్రంలోని మోడీ సర్కార్ అంతకు మించి ప్రజల నుంచి వసూలు చేస్తోంది.
ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.10వేల కోట్ల మొత్తాన్ని ప్రజల మీద వే పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోయింది. పెరిగిన ధరలతో పెట్రో ఉత్పత్తుల మీద అదనంగా ఈ ఏడాది వచ్చే ఎక్సైజ్ ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల లక్ష కోట్లుగా చెబుతున్నారు.
గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.33వేల కోట్ల మేర వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అప్పులకు చెల్లించాల్సిన రూ.10వేల కోట్లకు బదులుగా మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్న వైనం చూస్తే మోడీ సర్కార్ తీరు ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది.
పెట్రో ధరల నుంచి వసూలు చేసిన పన్నులతో రక్షణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నట్టు బీజేపీ దేశభక్తి అంటూ ప్రజల కళ్లకు గంతలు కడుతోంది. మరి లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను పోర్టులు, రోడ్లు అమ్మేయడ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చమురు బాండ్ల ద్వారా రూ.10వేల కోట్లు చెల్లించాలని చూస్తున్న మోడీ సర్కార్.. రానున్న సంవత్సరాల్లో చెల్లించాల్సిన మొత్తాలు కూడా ముక్కుపిండి వసూలు చేస్తోంది. ఏకంగా రూ.10వేల కోట్లకు.. రూ.30వేల కోట్లు వసూలు చేస్తోంది. ఇది సామాన్యులకు గుదిబండగా మారుతుందని ప్రజలు వాపోతున్నారు.