మోడీ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదట..ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు అంటే?
మొదటి విడతతో పోలిస్తే.. రెండో విడతలో ప్రధాని మోడీ ఇమేజ్ కు కాస్తంత డ్యామేజ్ అయినట్లుగా వాదనలు ఉన్నాయి. ఈ వాదనకు తగ్గట్లే దేశ సరిహద్దుల్లో చైనా.. దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్.. హర్యానా రైతులు చేస్తున్న ఆందోళన.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం లాంటి వరుస సవాళ్లతోకేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇలాంటి వేళ.. ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ ఇమేజ్ తగ్గినట్లుగా పలువురు విశ్లేషిస్తున్నారు.
అయితే.. అదేమీ నిజం కాదన్న విషయం తాజాగా జరిపిన సర్వే వెల్లడించింది. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే తోపాటు కార్వే సంస్థ జరిపిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లెక్కల ప్రకారం ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగినా.. ఏన్ డీఏ ఘన విజయం సాధిస్తుందన్న విషయాన్ని తేల్చింది. ఏన్ డీఏ ప్రభుత్వంపై ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదంటున్నారు. మెజార్టీ మార్కును దాటి 321 సీట్లను గెలుసుకుంటుందని తేల్చారు.
అంటే.. గత ఏడాది ఆగస్టులో చేసిన సర్వేతో పోలిస్తే..మరో ఐదు స్థానాల్లో అదనంగా గెలిచే పరిస్థితి ప్రస్తుతం ఉందని చెప్పాలి. అయితే.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏన్డీయే సొంతంగా గెలుచుకున్న 357స్థానాలతో పోలిస్తే తక్కువగా ఉండటాన్ని గుర్తించాలి. ప్రాంతాల వారీగా చూస్తే.. హిందీ.. హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారత్ లో ఏన్డీయే అత్యధికంగా 104 సీట్లను సొంతం చేసుకుంటుందని.. పశ్చిమ భారతంలో 85 సథానాలు.. తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో వంద స్థానాల్ని పాగా వేస్తుందని తేల్చారు.
కాకుంటే.. ఏన్డీయే విజయ యాత్రకు చెక్ పడేది మాత్రం దక్షిణాదిలోనేనని చెబుతున్నారు. ఇక్కడ మాత్రం కేవలం 32 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే వీలుందని చెబుతున్నారు. ఏన్డీయేలోని పార్టీల వారీగా లెక్కలు చూస్తే.. అత్యధిక స్థానాల్ని బీజేపీ సొంతం చేసుకోనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్కును సునాయాసంగా దాటేయటమే కాదు.. దగ్గర దగ్గర 300 మార్కు వరకు వస్తుందని అంచనా కట్టారు. ఎన్డీయే ఇలా దూసుకెళుతుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం 2019తో పోలిస్తే.. ఒక స్థానాన్ని తగ్గించుకొని 52 స్థానాల్ని మాత్రమే సొంతం చేసుకోగలదని అంచనా కట్టారు.
సర్వేలో ప్రధాని మోడీపై 74 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. ఏడేళ్లుగా ప్రధాని కుర్చీలో కూర్చున్న తర్వాత కూడా మోడీ ఇమేజ్ ఇంతలా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక.. ఎన్డీయే ప్రభుత్వ పాలనపై 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే బలం పరిమితంగా ఉండే దక్షిణాదిలోనూ మోడీ ఇమేజ్ మాత్రం బాగుండటం గమనార్హం. ఆ ప్రాంతంలో మోడీ పాపులార్టీ 63 శాతంగా ఉండటం విశేషం. ఈ సర్వే మరో విషయాన్ని వెల్లడించింది. ముస్లింలలో మోడీపై సంతృప్తిని 38 శాతం మంది వ్యక్తం చేయటం చూస్తే.. మోడీ ఇమేజ్ కు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించటం లేదనే చెప్పాలి.