ప్రస్తుతానికి టైమ్ లిస్ట్ లో ఒబామా 4..మోడీ 8

Update: 2015-12-02 05:15 GMT
ప్రఖ్యాత మీడియా సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’’ సర్వే ఈ ఏడాది సాగుతోంది. ఈ సర్వేకు సంబంధించిన తుది ఫలితాన్ని డిసెంబరు 5వ తేదీన ప్రకటిస్తారు. డిసెంబరు 4 తేదీ అర్థరాత్రి 11.59 వరకు సేకరిస్తారు. అనంతరం వీటిని ప్రకటిస్తారు. సర్వే తుది ఫలితాలు వెలువడటానికి మరో మూడు రోజుల ముందుగా చూస్తే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ 8 స్థానంలో నిలిచారు.

అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా 4 స్థానంలో నిలిచారు. ఆన్ లైన్ లో ఓటింగ్ లో భారీగా ఓట్లు నమోదు అయితే.. తుది ఫలితంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇక.. సర్వేలో ఇప్పటివరకూ ఉన్న స్థానాలు చూస్తే..

1. బెర్నీ శాండర్స్ (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు)

2. మలాల యూసఫ్ జాయ్ (పాక్ హక్కుల కార్యకర్త)

3. పోప్ ఫ్రాన్సిస్

4. బరాక్ ఒబామా

8. మోడీ

10. ఏంజెలా మోర్కల్ (జర్మనీ ఛాన్సలర్)
Tags:    

Similar News