సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరి క్రియేటివిటి వారిది. ఏదైనా కీలక పరిణామాలు చోటు చేసుకున్నంతనే దానిపై ఎవరికి వారుగా రియాక్టు అవుతున్నారు. తమ వాదనను వినిపిస్తున్నారు. కొన్నిసార్లు ఇలాంటి కామెంట్లు వైరల్ గా మారటమే కాదు.. అవో ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి. మరికొన్నిసార్లు మొదలు పెట్టిన వారికే ఎదురుదెబ్బలు తగిలే పరిస్థితి. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. చంద్రబాబుకు సంబంధించిన ఏ చిన్న సానుకూల పరిణామం చోటు చేసుకున్నా.. ఆ వెంటనే పచ్చ బ్యాచ్ అని.. కులగజ్జి అని ఇలాంటి రొడ్డుకొట్టుడు మాటలతో నోటికి వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తోంది. అధికారంలో ఉన్న వారు చెలరేగిపోవటం మామూలే అయినా.. దానికో పద్దతి పాడు లేకుండా పోవటంతోనే అసలు ఇబ్బంది వస్తోంది.
ఈ మధ్యనే ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబుతో ప్రధాని మోడీ పక్కకు తీసుకెళ్లి ఐదు నిమిషాలు మాట్లాడిన విషయాన్ని టీడీపీ కానీ.. పచ్చ మీడియాగా పేర్కొనే మీడియా సంస్థలు కానీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనిస్తే.. దాన్నో సాదాసీదా ఘటనగానే తీసుకున్నదే తప్పించి.. అదో విశేష పరిణామంగా ఫీలై భారీ ప్రయారిటీ ఇచ్చింది లేదు.
కానీ.. అధికార వైసీపీకి చెందిన వారు మాత్రం ఆ చిన్న వార్త (మహా అయితే ఐదారు లైన్లు.. లేదంటే మరో రెండులైన్లు అదనం మాత్రమే) కు రియాక్టుఅయిన తీరు చూసిన తర్వాత.. టీడీపీ వారికి సైతం నిజమే కదా? మనం మైలేజీ సాధించేందుకు.. అధికార వైసీపీకి పంచ్ లు వేసేందుకు ఈ వ్యవహారాన్ని హైలెట్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందని చెప్పాలి.
ఎప్పుడైతే వైసీపీ నేతలు ఈ అంశంపై నానా అర్థాలు తీస్తూ చంద్రబాబును టార్గెట్ చేయటం షురూ చేశారో.. అప్పటి నుంచి టీడీపీ అండ్ కో కూడా చెలరేగిపోవటం కనిపిస్తుంది. ఇలా ప్రత్యర్థులకు అనవసరమైన ప్రచారాన్ని చేసి.. వారిలో కాన్ఫిడెన్సు పెంచే విషయంలో వైసీపీ తప్పులు చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ప్రతి పరిణామానికి నెగిటివ్ కోణంలో పంచ్ లు వేసే వైసీపీ బ్యాచ్.. ఢిల్లీ లో మోడీ మాట్లాడిన దానికి.. బిహార్ లో చోటు చేసుకున్న పరిణామానికి లింకు వేస్తూ.. సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారానికి తెర తీశారు. 'లెగ్గు మహిమ. ఢిల్లీలో మాట కలిపినంతనే బిహార్ లో ప్రభుత్వం మటాష్ అయ్యింది' అంటూ ట్రోల్ చేయటం షురూ చేశారు.
దీనికి టీడీపీ వర్గాలు సైతం బలంగానే స్పందిస్తున్నాయి. లెగ్గు తమది కాదని.. తమ అధినేత చంద్రబాబు తర్వాత ప్రధాని మోడీతో గంటకు పైగా కలిసి లంచ్ చేసిన ఎఫెక్టు ఎంతన్నది బిహార్ లో ఇట్టే కనిపించిందంటూ రివర్సు దాడి షురూ చేశారు. బోడిగుండుకు మోకాలికి లింకులు వేసే ఇలాంటి వాదనలతో ఎదురుదెబ్బలు తప్పించి మరింకేమీ ఉండవన్న విషయాన్ని వైసీపీ పరివారం గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. గురి చూసి దెబ్బ కొట్టేలా వ్యాఖ్యలు ఉండాలే కానీ.. ప్రతిది ప్రచార అస్త్రంగా మార్చుకోవాలనే తపనతో మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.