మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయి. అమెరికా కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. యూరప్ లో ఎన్నో పేరెన్నిక గల సంస్థలు మూతబడ్డాయి. అయితే ఇండియా మాత్రం అప్పుడు కూడా ఠీవీగా కనిపించింది. భారత మార్కెట్లు ఉరకలు ఎత్తాయి. దేశీయ పరిశ్రమ అప్పుడు దేశాన్ని నిలబెట్టింది. పెద్దన్నల్లాంటి దేశాలే ఇబ్బందులు పడినా ఇండియా మాత్రం పెద్దగా అప్పుడు మాంద్యం ప్రభావానికి లోను కాలేదు!
ఇక ఇప్పుడు మోడీ జమానా. మొన్నేమో బంగ్లాదేశ్ ఆర్థిక ప్రగతి భారత దేశానికన్నా చాలా బాగుందని అంతర్జాతీయ సంస్థలు చెప్పాయి. ఇండియా కన్నా బంగ్లాదేశ్ ముందుకు దూసుకపోతోందని తేల్చాయి. తాజాగా హంగర్ ఇండెక్స్ లో ఇండియా కన్నా శ్రీలంక - పాకిస్తాన్ వంటి దేశాలు మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
ఆ దేశాల్లో పిల్లలకు మనదేశంలో కన్నా మంచి ఆహారం అందుతూ ఉంది. వారిలో పెరుగుదల స్థాయి బాగుంది. మనం చేస్తున్నామయ్యా.. అంటే.. జనాలు ఏం తినకూడదో - ఏం తినాలో చెబుతూ ఉన్నాం!
ఆఖరికి టూరిజం మీద ఆధారపడి బతికే శ్రీలంక వంటి దేశం కూడా ఆర్థిక మాంద్యం ప్రభావంలోకి పడటం లేదు. మన దేశంలో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుతూ ఉంది. ఇప్పటికే కార్ల అమ్మకాలు చాలా వరకూ ఆగిపోయాయని ఆ సంస్థలు ప్రకటించాడు. ఒక్క ఏడాదిలోనే లక్షకు పైగా కార్లఅమ్మకం తగ్గిపోయింది. దీంతో కార్ల కంపెనీలు నష్టాల్లోకి పడిపోయే పరిస్థితి వచ్చింది.
ఇక నోట్ల రద్దు అప్పుడు పడిపోయిన చిన్నాచితక పరిశ్రమలు మళ్లీ కోలుకోలేదని తెలుస్తోంది. మరోవైపు మోడీ ప్రభుత్వం నోట్లతో ప్రయోగాలు చేస్తూ ఉంది. ఆర్థిక మంత్రేమో మన్మోహన్ ను - కాంగ్రెస్ వాళ్లను విమర్శించే పనిలో ఉన్నారు. మూడు వంద కోట్ల రూపాయల సినిమాలు వచ్చాయి.. ఆర్థిక వ్యవస్థకు అంతకన్నా ఇంకేం కావాలన్నట్టుగా ఒక కేంద్రమంత్రి మాట్లాడారు. ఇదీ మోడీ జమానాలో జరుగుతున్నది. మాంద్యం ప్రభావం సామాన్యులపై పూర్తి స్థాయిలో పడితే పరిస్థితులు తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంది.