భారత దేశ ప్రజలు చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పదేళ్ల పాటు ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి నోట వెంట మాట రాని పరిస్థితి. పలుకే బంగారమా అన్నట్లుగా మౌనప్రధానిగా మన్మోహన్ సింగ్ వ్యవహరించటం.. ఏం జరిగినా ఆయన నుంచి ఎలాంటి స్పందన కనిపించకపోవటం దేశ ప్రజల్ని విపరీతమైన అసంతృప్తికి గురి చేసింది. అదే సమయంలో తన మాటలతో.. చేతలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు నరేంద్ర మోడీ.
గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. అభివృద్ధి విషయంలో గుజరాత్ కు తిరుగులేదన్న భావనను కల్పించటంలో ఆయన సక్సెస్ అయ్యారు. దేశ ముఖచిత్రాన్ని మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పక మారుస్తారన్న భావన కలిగేలా చేయటంలో మోడీ పరివారం విజయవంతమైంది. ఈ కారణంతోనే.. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితి. తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకున్న మోడీ.. ప్రధానిగా తానేం చేయాలనుకుంటే.. అది చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రజలు తమ తీర్పు నిచ్చారు. అధికారాన్ని కట్టబెట్టారు. పదేళ్లుగా ప్రధాని అన్న వ్యక్తి నోటి నుంచి నాలుగు మాటలు వినే భాగ్యం భారత ప్రజలు నోచుకోలేదన్న వేదనను తీరుస్తూ.. మోడీ మాట్లాడటం మొదలుపెట్టారు. మన్మోహన్ పూర్తిగా మౌనమునిగా వ్యవహరిస్తే.. మోడీ మాటల మనిషిగా వ్యవహరిస్తున్నారు.
తనకు లభించిన అద్భుతమైన అవకాశాన్ని మోడీ సద్వినియోగం చేసుకుంటారని అంతా భావించారు. హుందాగా వ్యవహరించటం.. తన ప్రసంగాల్లో ప్రదర్శించే పరిణితి.. పెద్ద మనిషి తత్వాన్ని మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపిస్తారని భావించారు. అయితే.. మోడీలోని మొండి మనిషి విపక్షాల పట్ల కరుకుగా వ్యవహరించటమే తప్పించి.. వాస్తవ దృష్టితో వ్యవహరించలేదు.
పార్లమెంటు వ్యవస్థలో లోక్ సభతో పాటు.. రాజ్యసభలో కూడా బలం ఉన్నప్పుడే విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వీలుంటుందన్న విషయం తెలిసినా.. నిర్లక్ష్యంతో వ్యవహరించారు. లోక్ సభలో తిరుగులేని మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి. బిల్లుల ఆమోదానికి అవసరమైన బలం లేక.. నిత్యం విపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి.
అయితే.. ఇదేమంత పెద్ద విషయం కాదన్నట్లుగా మోడీ అండ్ కో వ్యవహరించారు. దేశ స్థితిగతుల్ని మార్చేందుకు వీలుగా.. భారీ నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారపక్షంతో పాటు.. విపక్ష సాయం అవసరమవుతుందన్న విషయాన్ని గుర్తించినా కూడా.. గుర్తించనట్లుగా వ్యవహరించారు. ప్రధాన ప్రతిపక్షంపై కటువుగా ప్రవర్తించారు. సార్వత్రిక ఎన్నకల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదు. సాంకేతికంగా ఇది నిజమే అయినప్పటికీ.. విపక్షంతో స్నేహపూర్వకంగా ఉండేందుకు.. హుందా రాజకీయాలు నడిపేందుకు వీలుగా.. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టినంత మాత్రాన మోడీకి వచ్చే ప్రత్యేక నష్టమేమీ ఉండదు.
కానీ.. మోడీ స్నేహంగా ఉండే కన్నా.. విపక్షంతో కటువుగా ఉండేలానే వ్యవహరించారు. నిజానికి ఇలాంటి తీరు రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తాయి. ప్రజాస్వామ్యంలో అధికార.. విపక్షాలన్నీ బండికి జోడు చక్రాల్లాంటివి. ఈ రెండు ఎవరి పాత్రను వారు పోషించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు విపక్షాల ఉనికి అనేది లేకుండా చేయాలన్నట్లుగా మోడీ అండ్ కో ఆలోచనగా కనిపిస్తుంది. ప్రసంగాల్లో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మాట్లాడే మోడీ.. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం కనిపిస్తుంది. తన పాలనా ముద్ర దేశం మీద చూపించాలంటే తన ఒక్కడితోనే సరిపోదని.. పలువురి చేయూత అవసరమన్న విషయాన్ని మోడీ గుర్తించటం లేదు.
విపక్షాల పట్ల కరుకుగా వ్యవహరించే మోడీ తత్వాన్ని చూసినప్పుడు.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గుర్తుకు రాక మానదు. అరకొర బలంతో.. తుమ్మితే ముక్కు ఉడిపోయే సంకీర్ణ భాగస్వామ్యంతో ఐదేళ్ల పాటు ప్రధానిగా వ్యవహరించటమే కాదు.. ఎంతకూ మింగుడుపడని విపక్షం మనసు గెలుచుకునేలా వ్యవహరించారు. ప్రధానిగా ఉండి దేశ ప్రయోజనాల్ని కాక్షించారే తప్పించి.. పీవీ చిల్లర రాజకీయాలకు పాల్పడలేదని చెప్పాలి.
భారత్ తరఫున గళాన్ని వినిపించాల్సి వచ్చిన సమయంలో.. అధికారపక్షంలో ఎంతోమంది నేతలు ఉన్నప్పటికీ.. నాటి విపక్ష నేత వాజ్ పేయ్ ను ఎంపిక చేసి విస్మయ పరిచారు. పీవీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. ఐక్యరాజ్య సమితితో భారత్ గళాన్ని వినిపించటంలో వాజ్ పేయ్ విజయం సాధించారు. నిజానికి అంతకు మించిన అద్భుత క్షణాలు ఇంకేం ఉంటాయి. ఒక విపక్ష నేతలోని అసమాన ప్రతిభను గుర్తించటానికి మించిన గొప్ప విషయం ఏముంటుంది?
దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించి.. అందరిలోకెల్లా ది బెస్ట్ విపక్ష నేత అయినప్పుడు సాయం కోరటంలో తప్పేముందన్నట్లుగా పీవీ వ్యవహరించారే తప్పించి.. చిల్లర రాజకీయాలు చేసిందేమీ లేదు. రాజు స్థానంలో ఉన్న వ్యక్తి అన్నీ పనులు చేయలేడు. చేయాలని భావించటం కూడా తప్పే. ఎందుకంటే.. రాజు ఉన్నది రాజ్యాన్ని పాలించటానికే తప్పించి.. తానే అన్నీ పనులు చేసుకోవటానికి కాదు. తన రాజ్యంలో ఉన్న వారి ప్రతిభను సమర్థంగా వినియోగించటంలోనే రాజు తెలివితేటలు బయటపడతాయి.
నాడు వాజ్ పేయ్ విషయంలో ప్రధాని హోదాలో ఉన్న పీవీ నరసింహారావు వ్యవహరించి వైఖరిని గుర్తు చేసుకొని.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. కాలం.. రాజకీయ విలువలు ఎంతగా మారిపోయాయో ఇట్టే తెలుస్తుంది. మోడీ ముందు.. ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్ సైతం కొన్ని విషయాల్లో అభినందించాల్సిందే. నోరు విప్పి మాట్లాడకున్నా.. విపక్షాల మనసుల్ని గాయపరిచేలా ఆయన వ్యవహరించింది లేదు. విపక్ష నేతలు సైతం ఆయనపై విమర్శలు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే వారు. కొన్ని కీలక అంశాల విషయానికి వచ్చినప్పుడు.. రాజనీతితో వ్యవహరించి.. వారిని ఒప్పించారే తప్పించి నొప్పించలేదు. మోడీ కానీ పీవీలా వ్యవహరించి ఉంటే.. కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా కట్టబెట్టే వారు. కాంగ్రెస్ తో గిల్లికజ్జాలు పెట్టుకోవటం.. వారి ఇగో దెబ్బ తీసేలా మాట్లాడటం లాంటివి చేయరు. దివంగత ప్రధానమంత్రులు నెహ్రూ.. ఇందిర లాంటి వారి జయంతి.. వర్థంతుల సందర్భంగా వారి ఘాట్లను సందర్శించి పరిణితి కలిగిన రాజకీయ నేతగా వ్యవహరించి ఉంటే.. మోడీ మీద ఇప్పుడు కురుస్తున్న విమర్శల జోరు ఈ స్థాయిలో ఉండేది కాదేమో.
కానీ.. ప్రస్తుతం అందుకు భిన్నమైన రాజకీయం దేశంలో సాగుతోంది. అధికారంలో ఉన్న వారు సుప్రీం అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షాలు అంటే అణకాణి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పించి వారిపట్ల అనునయంతో వ్యవహరించాలన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు. ప్రభుత్వం సాఫీగా సాగాలంటే.. అధికారం చేతిలో ఉంటేనే సరిపోదని.. ప్రతిపక్షాల భాగస్వామ్యం కూడా అవసరమేనన్న విషయాన్ని మోడీ మర్చిపోతున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల ఫలితాల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో అయినా.. మోడీ మైండ్ సెట్ లో మార్పు వస్తే బాగుండే. దేశ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి.. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఆదర్శాలు వల్లె వేసే నేతలో.. అందుకు విరుద్ధ వైఖరి ఉండటం దేశ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తుందన్న విషయం మర్చిపోకూడదు. మోడీ మైండ్ సెట్ దేశ ప్రగతిని ప్రభావితం చేస్తుందన్నది నిజం. ఆ వాస్తవాన్ని మోడీ గుర్తిస్తారా..?