ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కోసం ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి కొద్ది నిమిషాల్లో సభా స్థలికి బయలుదేరనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు సుమారుగా అర్ధగంట ముందుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరం చేరుకున్నారు. ప్రధాని మోడీని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. భారీ భద్రత నడుమ బయలుదేరుతున్న మోడీ 20 నిమిషాల్లో సభా వేదికకు చేరుకోబోతున్నారు.
అమరావతి శంకుస్థాపన మోడీ చేతుల మీదుగానే జరగనున్న సంగతి తెలిసిందే. తొలుత మోడీ అమరావతి చరిత్రకు దర్పణం పట్టేలా, నవ్యాంధ్ర రాజధానికి కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.36 నుంచి 12.43 గంటల మధ్య శంకుస్థాపన ముహూర్తం. ఆ సమయంలోనే మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో ఉదయం 9 నుంచే గణపతి హోమం, పూజలు మొదలయ్యాయి. ప్రధాని సమక్షంలో మొదట వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు. యాగద్రవ్యాలను అగ్నిదేవుడికి సమర్పిస్తారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. నవరత్నాలు ఉంచిన పేటికను పుడమి తల్లికి సమర్పించాక శిలాన్యాసం చేస్తారు. శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఇంకేముంది.. ప్రధాని రావడంతో శంకుస్థాపన కార్యక్రమానికి సమయం పూర్తిగా దగ్గరపడినట్లే.. కార్యక్రమాన్ని వీక్షించడానికి అందరూ సిద్ధం కావాల్సిందే.
Buy Bricks Online and Contribute to Amaravathi : http://amaravati.gov.in/EBRICKS/Index.aspx