ఈసారికి జ‌మిలికి తూచ్ చెప్పేశార‌ట‌

Update: 2017-11-13 04:08 GMT
మొన‌గాడు మోడీకి దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. త‌న‌కేమాత్రం ఇష్టం లేని అంశాల మీద ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల‌కు భిన్నంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తోంది. లోక్ స‌భ‌కు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న వేళ‌.. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌ల్ని నిర్వ‌హించే జ‌మిలి క‌ల‌ను క‌న్నారు ప్ర‌ధాని మోడీ. అలా చేయ‌టం ద్వారా వేలాది కోట్ల రూపాయిలు ఆదా చేయ‌టంతో పాటు.. రాజ‌కీయంగా బ‌లంగా ఉండొచ్చ‌ని భావించారు.

జ‌మిలి ఎన్నిక‌ల‌తో అధికార‌ప‌క్షానికి తిరుగులేని ప‌వ‌ర్ అందిపుచ్చుకోవ‌టంతో పాటు త‌మ ప‌ద‌వీ కాలంలో తీసుకోవాల్సిన నిర్ణ‌యాలకు ఎలాంటి ఆటంకం ఉండ‌ద‌ని భావించారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు జ‌మిలి ఎన్నిక‌ల క‌ల‌ను క‌ల్ల‌లు చేసిన‌ట్లుగా చెబుతున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో పాటు జీఎస్టీ ఇష్యూలో దేశ వ్యాప్తంగా నెల‌కొన్న తీవ్ర‌త నేప‌థ్యంలో జ‌మిలి జోలికి వెళ్ల‌క‌పోవ‌టం మంచిద‌న్న భావ‌న‌కు మోడీ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాలు జ‌మిలి ఎన్నిక‌ల‌కు సిద్దంగా లేక‌పోవ‌టం కూడా కార‌ణంగా చెబుతున్నారు. ప‌లు రాజ‌కీయ పార్టీలు సైతం జ‌మిలి ఎన్నిక‌ల‌కు సానుకూలంగా లేద‌ని చెబుతున్నారు. దీంతో.. 2019 ఎన్నిక‌లు షెడ్యూల్ ప్ర‌కారం సార్వ‌త్రిక ఎన్నిక‌లు నిర్వ‌హించ‌ట‌మే త‌ప్పించి.. మొద‌ట్లో వినిపించిన‌ట్లుగా ముంద‌స్తుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌కు బ్రేకులు వేసిన‌ట్లుగా తెలుస్తోంది.

జ‌మిలి ఎన్నిక‌ల ఆలోచ‌న తెర మీద‌కు వ‌చ్చిన‌ప్పుడు షెడ్యూల్ ప్ర‌కారం నిర్వ‌హించే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని భావించారు.అయితే.. ఇందుకు వ్య‌తిరేక‌త రావ‌టంతో 2024 ఎన్నిక‌ల‌ను జ‌మిలికి త‌గ్గ‌ట్లు నిర్వ‌హించే దిశ‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం అడుగులు వేస్తోంది. జ‌మిలి ఎన్నిక‌ల మీద మోడీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న‌ప్ప‌టికీ.. తాజాగా ఉన్న ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌మిలి సాహ‌సానికి మోడీ స‌ర్కారు నో అనేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News