ప్రతిపక్షాలపై మోడీ ‘సోషల్’ సెటైర్లు

Update: 2021-03-21 05:39 GMT
కరెంట్ ట్రెండింగ్ టాపిక్ లను పట్టుకొని ప్రసంగించడంలో ప్రధాని నరేంద్రమోడీని మించిన వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ట్రెండ్ ఫాలో అవుతుంటాడు.. ట్రెండ్ సెట్ చేస్తాడు.

గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాడు రిలీజ్ అయిన బాహుబలి సినిమాలోని ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అని మోడీ సినిమాను వాడుకొని చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది. తాజాగా ఈసారి సోషల్ మీడియాను వాడుకొని మోడీ వేసిన పంచ్ కూడా అదిరింది.

తాజాగా బీజేపీకి గెలుపు అవకాశాలున్న పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ప్రధాని మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘గత రాత్రి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా 50-55 నిమిషాలు పనిచేయకపోతే అందరూ ఎంతో అసహనం వ్యక్తం చేశారు. అలాంటిది 50-55 సంవత్సరాలుగా బెంగాల్ లో అభివృద్ధి కుంటుపడుతుంటే ఎంత అసంతృప్తిగా ఉన్నారో అర్థం చేసుకోగలను.’ అంటూ మోడీ తనదైన స్టైల్లో సోషల్ మీడియాను బూచీగా చూపి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

  అటు అస్సాంలో తేయాకు పరిశ్రమకు నష్టం కలిగించేవారికి కాంగ్రెస్ మద్దతునిస్తుందని.. వారితో అభివృద్ధి జరగదు అని మోడీ ఆరోపించారు.

మొత్తంగా మోడీ సార్ ట్రెండింగ్స్ వాడుకొని మరీ ప్రతిపక్షాలపై విమర్శిస్తూ ప్రజలకు చేరువ అవుతున్న తీరు అభినందించాల్సిందే.
Tags:    

Similar News