60 ఏళ్లు పైబడిన వృద్ధులకు.. 45 ఏళ్లు పైబడిన ధీర్ఘాకాలిక రోగులకు మార్చి 1వ తేది నుంచి దేశంలో ఉచితంగా కరోనా టీకా ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. భారతదేశం అంతటా ఈ కోవిడ్ టీకా డ్రైవ్ ప్రారంభించడానికి ప్రధాని స్వయంగా కదిలివచ్చారు. ఈ తెల్లవారుజామున పిఎం మోడీ కరోనా వైరస్ నివారణ టీకాలు తీసుకున్నారు.
"ఎయిమ్స్ వద్ద నా మొదటి మోతాదు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాను. కరోనాకి వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మా వైద్యులు మరియు శాస్త్రవేత్తలు త్వరితగతిన ఎలా పనిచేశారో చెప్పుకోదగినది. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్న వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ టీకా తీసుకొని భారతదేశాన్ని కరోనా రహిత దేశం చేద్దాం.. " ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
వృద్ధులు, రోగుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ రెండో దశ మార్చి 1 (సోమవారం) నుండి దేశంలో ప్రారంభమవుతుంది.
వ్యాక్సిన్ క్యాబ్ పొందాలనుకునే వారు ఉదయం 9:00 నుండి www.cowin.gov.in లో నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది.
పౌరులు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా, కోవిన్ 2.0 పోర్టల్ ఉపయోగించి లేదా ఆరోగ్య సేతు వంటి ఇతర ఐటి అప్లికేషన్ల ద్వారా టీకాలు వేయడానికి నమోదు చేసుకోవచ్చు.. బుక్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మోడీ వ్యాక్సిన్ వేయించుకునేది ఆయన ముందుగా అనుకోలేదని తెలిసింది. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. కేవలం గంట ముందు మాత్రమే పీఎంఓ అధికారులు ఎయిమ్స్ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. ఎయిమ్స్ లోని సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రధాని మోడీ తెల్లవారుజామునే ఎయిమ్స్ కు చేరుకున్నారు. నేరుగా వ్యాక్సినేషన్ విభాగానికి వెళ్లారు. ప్రధాని మెడలో ‘అస్సామీ సంస్కృతి’ కండువా వేసుకున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్ లో మోడీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. మోడీ స్వదేశీ కోవాగ్జిన్ తీసుకుంటారా? లేక విదేశీ తయారీ అయినా ఆక్స్ ఫర్డ్ టీకా ‘కోవీషీల్డ్’ తీసుకుంటారా? అన్న ప్రశ్నలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ స్వదేశీ భారత్ లో తయారైన హైదరాబాదీ ‘భారత్ బయోటెక్’ కంపెనీ తయారు చేసిన ‘కోవాగ్జిన్’ టీకాను తీసుకొన్ని గొప్ప సందేశాన్ని చాటారు. .