మోడీని చంపే కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైంది

Update: 2016-07-28 15:53 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని హ‌త్య చేసేందుకు కుట్ర జ‌రిగిన విష‌యం మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లైంది. అంతేకాదు విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా హ‌త్యకు కూడా వేసిన‌ స్కెచ్ విష‌యం తేలింది. అయితే ఈ కుట్ర జ‌రిగింది మోడీ సీఎంగా ఉన్న స‌మ‌యంలో. 2002లో గుజరాత్ అల్లర్ల తరువాత రాష్ట్రానికి సీఎంగా ఉన్న నరేంద్ర మోడీతో పాటు తొగాడియాను హత్య చేసేందుకు కుట్ర జరిగిన మాట వాస్తవమేనని తేలింది. ముంబై మోకా కోర్టు ఈ మేర‌కు త‌న ద‌ర్యాప్తులో తేట‌తెల్లం చేసింది.

మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన విచార‌ణలో గుజ‌రాత్ సీఎంగా ఉన్న స‌మయంలో మోడీ హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని తేల్చింది. అబూ జిందాల్ అలియాస్ సయ్యద్ జుబేదిన్ అన్సారీ ఈ హత్యలకు కుట్ర పన్నాడన్న ఆరోపణలపై విచారణ జరిపగా ఆయ‌న‌పై మోపిన అభియోగాల‌న్నీ నిజ‌మ‌ని తేలింది. ముంబై మోకా కోర్టు విషయాన్ని ధృవీకరించింది. ఆరోపణలు వాస్తవమేనని మోడీ - తొగాడియాల హత్యకు అబూ జిందాల్ కుట్ర పన్నాడని తెలిపింది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరినీ నిందితులుగా భావించలేమని, ప్రధాన నిందితుడు అబూ జిందాల్ తో పాటు మరో వ్యక్తి మాత్రమే కుట్రతో సంబంధం కలిగి ఉన్నాడని కోర్టు ప్రకటించింది. ఈ కేసులో చిక్కుకున్న జిందాల్ త‌ప్పించుకునేందుకు సౌదీ అరేబియాకు వెళ్లాడు. అయితే అక్క‌డ పట్టుబడడంతో.. సౌదీ ఇండియా మధ్య కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు ఆయ‌న్ను భార‌త‌దేశానికి తీసుకువ‌చ్చి విచార‌ణ జ‌రిపారు.
Tags:    

Similar News