కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మరోసారి .. బీజేపీ పెద్దాయన, ప్రధాని నరేంద్రమోడీపై చాలా తీవ్రమైన ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్ లోని సన్ బీమ్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా ప్రియాంక మాట్లాడారు. ‘బిర్యానీ తినేందుకు పాకిస్తాన్ కు వెళ్లింది మోడీయే కదా’ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాకిస్తాన్ గా సపోర్టుగా మాట్లాడుతున్నారని.. వారి ప్రసంగాలకు పాక్ లో హర్షతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ప్రియాంక ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు. 2015లో పాకిస్తాన్ కు వెళ్లిన ప్రధాని మోడీకి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా బిర్యానీ వడ్డించిన సందర్భాన్ని గుర్తు చేసి ప్రియాంక ఎండగట్టారు.
తన పదవీ కాలంలో తరచూ విదేశాలకు వెళ్లే మోడీకి గత ఐదేళ్లలో తన నియోజకవర్గం వారణాసీలోని ఒక్క గ్రామాన్ని కూడా సందర్శించే తీరిక దొరకలేదని ప్రియాంక గాంధీ విమర్శించారు. కోర్టులో తేలకుండా అయోధ్య రామ మందిరాన్ని రాజకీయాల కోసం బీజేపీ- మోడీ వాడుకోవద్దని హితవు పలికింది.
కాగా యూపీలో ప్రియాంక గాంధీ ప్రచారానికి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఆమె సామాన్యులతో కలిసి పోవడం.. రోడ్ షో, సభలు, విద్యార్థులతో మమేకమవుతున్న తీరు జనాలకు చేరువవుతోంది. ప్రియాంక రోడ్ షో సందర్భంగా ఆమె అచ్చం ఇందిరాగాంధీలా ఉండడం చూసి అందరూ ‘ఇందిరాగాంధీ రిటర్స్స్’ అనే పోస్టర్లను యూపీ అంతటా ఏర్పాటు చేశారు.