మోడీ సైనికుల పరామర్శ.. ప్రచార స్టంటేనా?

Update: 2020-07-05 11:37 GMT
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా  లడఖ్ రాజధాని లేహ్‌ను సందర్శించారు. భారత సైన్యం, వైమానిక దళంతో మాట్లాడారు.  సరిహద్దు వద్ద హింసాత్మక ఘర్షణల్లో గాయపడిన సైనికులను ఆస్పత్రికెళ్లి పరామర్శించాడు. ప్రధాని సైనిక ఆసుపత్రిని సందర్శించిన ఫొటోలు తాజాగా వివాదానికి కారణమయ్యాయి.

అనేకమంది  కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు ప్రధాని లఢఖ్ పర్యటన ఒట్టి ప్రచార స్టంట్ ఆయన ఫొటోలు షేర్ చేస్తూ ఎగతాళి చేస్తున్నారు.  కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా మోడీ పర్యటనను ఎద్దేవా చేశాడు. నాడు  మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో గాయపడిన సైనికులను సందర్శించిన చిత్రాలను ఇప్పుడు మోడీ ఫొటోలను పక్కపక్కన షేర్ చేసి ట్వీట్ చేసి ‘‘ఈ చిత్రాలే చెప్తాయి మిలియన్ వర్డ్స్’’ అంటూ  ట్వీట్ చేశారు. మోడీది ఒట్టి ప్రచార స్టంట్ అని ట్వీట్ లో దెప్పిపొడిచాడు.

నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ సైనిక ఆస్పత్రి సందర్శనలో పక్కన వైద్యులు.. సైనికులకు గ్లూకోజ్ పెట్టి చికిత్స పొందుతున్నట్టు ఉంది. కానీ మోడీ పర్యటనలో చైనా సైనికులతో ఘర్షణలో గాయపడ్డ వారిని ఆస్పత్రిలో ఉంచలేదు.  ఒక కాన్ఫరెన్స్ హాల్ ను ఒక ఆసుపత్రిలా మార్చి అందులో ఉంచారు. వారు గాయపడ్డా వారికి గ్లూకోజ్ బాటిల్స్ పెట్టలేదు. వైద్య పరికరాలు, మందులు లేవు.. వైద్యుడి స్థానంలో ఫోటోగ్రాఫర్ లు కనిపించారు.

దీన్ని బట్టి మోడీ సైనికుల పరామర్శ కేవలం స్టంట్ అని కాంగ్రెస్ నేత పీ.చిదంబరం విమర్శించాడు.  అంతకుముందు కూడా మోడీ ఇలాంటి ప్రచార స్టంట్ లు చేశాడని కాంగ్రెస్ నేతలు ఆడిపోసుకుంటున్నారు. ఆ మధ్య బీచ్‌లో ఖాళీ సీసాలను ఒకసంచిలో ఏరుతూ మోడీ స్వచ్ఛ భారత్ చేయడం వివాదానికి దారితీసింది. అలాగే, మోడీ  యోగా దినోత్సవ చిత్రాలు కూడా ప్రచారపర్వమేనని అందరూ ఆడిపోసుకున్నారు.  ప్రతిపక్షాలు అంతా మోడీ   లఢక్ సందర్శనను ప్రచార స్టంట్‌గా విమర్శించారు.

అయితే సైనికుల కోసం ఒక కాన్ఫరెన్స్ హాల్ ను 100 పడకల ఆసుపత్రిగా మార్చారని.. వారంతా చికిత్సతో కోలుకున్నారని.. అందుకే సెలైన్ బాటిల్స్ గట్రా ఏమీ లేవని అంటున్నారు. మోడీ సందర్శన నిజమని బీజేపీ నేతలు చెబుతున్నారు. సైనికులంతా రెస్ట్ తీసుకుంటూ సిద్ధమవుతున్నారని తెలిపారు.

Similar News