ప్రధాని నరేంద్రమోడీ తాజా ఉత్తరప్రదేశ్ లోని కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర గంగానదిలోని త్రివేణి సంగమం వద్ద గంగా, యువనా, సరస్వతీ నదులకు పూజలు చేసి మునిగారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా మోడీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మోడీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక కుర్తా ధరించి పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ త్రివేణి సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేసిన పురోహితులకు దక్షిణం ఇచ్చారు. అనంతరం గంగానదికి హారతి ఇచ్చారు.
అనంతరం ట్విట్టర్ లో ఆ ఫొటోలను షేర్ చేసిన మోడీ.. ‘‘కుంభమేళాలో పాల్గొని పూజలు చేశాను. 130 కోట్ల మంది భారతీయులు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థన చేశాను’ అంటూ పేర్కొన్నారు.
అనంతరం గంగానదిని ఇంత శుభ్రం గా ఉంచిన పారిశుధ్య కార్మికుల వద్దకు వెళ్లిన మోడీ వారి పాదాలను పట్టుకొని కాళ్లు కడగడం విశేషం. అనంతరం వస్త్రంతో స్వయంగా శుభ్రం చేశారు. భారత్ ను ఇంత శుభ్రం ఉంచుతున్న వీరి పాదాలను కడగడం తప్పులేదని మోడీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని దేశంలో గౌరవించాలనే ఉద్దేశంతో ఈ పనిచేసినట్టు పేర్కొన్నారు. కుంభమేళాలో ఇంత పరిశుభ్రంగా ఉంచినందుకు మోడీ పారిశుధ్య కార్మికులను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోడీ వీడియో సోషల్ మీడియా - మీడియాలో వైరల్ గా మారింది.
Full View