దేశ ప్రధాని నరేంద్ర మోడీని అభిమానించే వారికి.. ఆయన్ను పిచ్చ పిచ్చగా ఆరాధించే వారికి.. వీరాభిమానులకు పండుగ లాంటి వార్తగా చెప్పాలి. వినాయక చవితి ముంగిట్లోకి వచ్చిన వేళలో.. మోడీకి లభించిన అరుదైన గుర్తించి వారిని ఆనందంలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అమెరికాకు చెందిన ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వే సంస్థ తాజాగా నరి్వహించిన సర్వేలో.. ఆసక్తికర అంశం బయటకువచ్చింది. ప్రపంచంలో 13 మంది నేతల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతను ఎవరో గుర్తించాల్సింది ఆప్షన్లు ఇచ్చారు. దాని ఆధారంగా తాజా ఫలితాల్ని వెల్లడించారు.
సర్వే గణాంకాల ఆధారంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఎంతన్న విషయాన్ని చెప్పేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది ఆయన్ను అత్యంత ఆదరణ కలిగిన ప్రధానిగా గుర్తించారు. సర్వేలో పాల్గొన్న యూత్ లో కేవలం 25 శాతం మాత్రమే వ్యతిరేకించారు. ప్రజాదరణ విషయంలో ప్రధాని మోడీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపేజ్ ఓబ్రడార్.. ఇటలీ ప్రధాని మారియో డ్రాఘి ఉన్నారు.
గత వారంలో కూడా ప్రజామోదంలో మోడీనే ముందు ఉండటం గమనార్హం. దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ బలంగా తాకిన జైన్ లో ఆయనకున్న ప్రజాదరణ 66 శాతానికి తగ్గింది. అంతకు ముందు.. అంటే 2019 ఆగస్టులో చేసిన సర్వేలో మోడీకి ఏకంగా 82 శాతం మంది సానుకూలంగా స్పందించటమే కాదు.. ఇష్టపడేవారన్న విషయాన్ని మర్చిపోలేం. ఇంతకూ ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోవచ్చా? శాస్త్రీయంగానే నిర్వహిస్తారా? అన్న సందేహాలకు సమాధానం ఇస్తోంది సర్వే నిర్వహించిన సంస్థ.
మార్నింగ్ కన్సల్ట్ కు చెందిన రాజకీయ విభాగం ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల మందిని ప్రశ్నిస్తారు. తద్వారా నేతలకు ఉన్న ఇమేజ్ ఎంతన్న విషయాన్ని మదింపు చేస్తారు. ఒక్క అమెరికా అధ్యక్షుడికి సంబంధించి ఆ దేశంలో నిత్యం 5వేల మందిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆన్ లైన్ లో జరిగే ఈ మొత్తం ప్రాసెస్ ను ప్రతి వారం యావరేజ్ చేసి ఫలితాల్ని వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే.. చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు.
ఆయన్ను 64 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇక.. టాప్ ఐదు స్థానాల్లో ఎవరెవరు ఉన్నారన్నది చూస్తే..
స్థానం దేశం ప్రధాని/దేశాధ్యక్షుడు
1 భారత్ నరేంద్ర మోడీ
2 మెక్సికో లోఫెజ్ ఓబ్రాడార్
3 ఇటలీ మారియో బ్రాఘి
4 జర్మనీ ఏంజెలా మెర్కెల్
5 అమెరికా జో బైడెన్