మహమ్మారి వైరస్ కట్టడి కోసం భారతదేశం అస్త్రంగా భావించినది లాక్‌డౌన్. దీంతో మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు దశల వారీగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మే 31వ తేదీతో నాలుగో దశ లాక్ డౌన్ ముగియనుంది. ప్రస్తుతం దేశంలో వైరస్ విజృంభిస్తోంది. ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రోజుకు వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆ కేసులన్నీ పట్టణాలు - నగరాల్లోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం నాలుగో దశ సడలింపులతో కొనసాగుతున్నాయి. అసలు లాక్ డౌన్ ఉన్నా లేనట్టే ఉంది. అందుకే భారీస్థాయిలో కేసులు నమోదు కావడానికి కారణంగా నిలుస్తోంది. అయితే కొన్ని రోజుల్లో లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐదో దశ లాక్ డౌన్ పై చర్చ మొదలైంది. ఐదో దశ లాక్ డౌన్ తప్పక ఉంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం దేశంలో 1,51,769 మందికి కరోనా సోకింది. 64,426 మంది కోలుకున్నారు. 4337 మంది మరణించారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి నిష్పత్తి 42.45 శాతంగా ఉంది. అయితే ఈసారి గ్రీన్ - ఆరెంజ్ - రెడ్ జోన్లు అనేవి ఉన్నా సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఐదో దశ లాక్ డౌన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. దేశంలో పాజిటివ్ కేసులు లక్షన్నరకు దాటడంతో లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని రాష్ట్రాలతో పాటు పలువురు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐదోదశ లాక్ డౌన్ పై కేంద్రం చర్యలు చేపట్టింది.
లాక్ డౌన్ గతంలో మాదిరి కాకుండా ఈసారి వైరస్ తీవ్రంగా ఉన్న నగరాల్లోనే విధించేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యధిక కేసులు ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర - గుజరాత్ - తమిళనాడు, -ఢిల్లీలో లాక్ డౌన్ పూర్తిగా కొనసాగే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే ముంబై - పూణె - జైపూర్ - సూరత్ - అహ్మదాబాద్ - చెన్నై - కోల్ కతా - థానే - ఇండోర్ - బెంగళూరు - హైదరాబాద్ సహా మొత్తం 10 నగరాల్లో లాక్ డౌన్ విధిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై ఈ నెలాఖరున మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
లాక్ డౌన్-5లో రెండు వారాల పాటు విధించి వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో మరికొన్ని సడలింపులు ఇస్తారని వినిపిస్తున్న మాట. అయితే కేసులు లేని చోట విద్యాసంస్థలు - సినిమాహాళ్లు - దేవాలయాలు - జిమ్ లు తెరిచే అవకాశం ఉంది.